http://jyothivalaboju.blogspot.com/feeds/posts/default?alt=rss

Syndicate content
Updated: 52 min 41 sec ago

తండ్రి లాలన - పిల్లలకు వరం

Mon, 01/30/2012 - 21:04
ప్రేమ అనగానే ఆడవాళ్ళూ, అమ్మలే గుర్తొస్తారు. కాని కూతురు మీద నాన్నకి అమితమైన ప్రేమ ఉంటుంది కాని అది పైకి కనపడనివ్వడు అని గతంలో కూడా చెప్పాను కదా.. మరి కొన్ని భావాలు. నాలో తనని తాను చూసుకుంటూ నా అభివృద్దిని చూసి ఆశ్చర్యపోతూ, ఆనందపడుతూ గర్విస్తున్న మా నాన్నకు, పెళ్ళయ్యాక కూడా కూతురు మీద బెంగ పెట్టుకుని ఎలా ఉందో అని రోజూ గుర్తు చేసుకునే మావారికి ఈ వ్యాసం అంకితం. పది రోజుల్లో ౭౦ ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్న మా నాన్నకు ఇంతకంటే మంచి బహుమతి ఇవ్వలేనేమో..

హాపీ బర్త్ డే నాన్న..

నాలోని పట్టుదల,మొండితనం. క్రమశిక్షణ, పాత పాటల మీద అభిమానం అన్నీ నాన్న నుండి వచ్చినవే..




తండ్రి లాలన పిల్లలకు వరం


ప్రేమ.. ఒక మంత్రం. ఒక అద్భుతం. వ్యక్తుల మధ్య అనుబంధాన్ని పెంచి దృఢపరిచేదే ప్రేమే. అది లేనివాడు రాక్షసుడు, శూన్యం లాంటివాడు. ఈ ప్రేమ అనేది ఒక వ్యక్తి మీద కావొచ్చు, ఒక వస్తువు మీద కావొచ్చు. ఒక పనిమీద కావొచ్చు.. తనను తాను ప్రేమించేవాడు అందరినీ ప్రేమిస్తాడు అని నానుడి. మనసులో ఉన్న ప్రేమను వ్యక్తీకరించడం కూడా ఒక కళే. తల్లిదండ్రులను, భార్యాభర్తలను, స్నేహితులను ఒక్కటిగా చేసేది, కలిపి ఉంచేది ఈ ప్రేమే. వివాహ బంధంతో ఒక్కటైన స్ర్తిపురుషులు ప్రేమతో తమదైన లోకాన్ని సృష్టించుకుంటారు. వారి ప్రేమకు ప్రతిఫలమే పిల్లలు.



పిల్లలను తల్లి మాత్రమే ఎక్కువ ప్రేమిస్తుంది. తండ్రికి ప్రేమించడం తెలీదు అనుకుంటారు.. కాని తండ్రి కూడా తన పిల్లలను అమితంగా ప్రేమిస్తాడు. కాని అతను బయటకు చెప్పలేడు.. పిల్లల మీద తల్లిదండ్రులకు ఒకేవిధమైన ప్రేముంటుంది కాని వ్యక్తీకరణలోనే కాస్త తేడా ఉంటుంది. కుటుంబంలో తండ్రి బాధ్యత బయటకు వెళ్లి సంపాదించి, తన కుటుంబాన్ని పోషిస్తే తల్లి ఇల్లు, పిల్లల బాధ్యత తీసుకుంటుంది. అందుకే పిల్లలకు తల్లి ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. తల్లితండ్రులు, పిల్లల గురించి చెప్పుకుంటే.. సాధారణంగా అందరూ అనుకునే మాటే కొడుకు తల్లి పోలిక, కూతురు తండ్రి పోలిక అని. అలాగే తండ్రికి కొడుకు కంటే కూతురి మీదే ప్రేమ ఎక్కువగా ఉంటుంది అంటారు.. ఇది నిజమే.. కొడుకు అనగానే వాడు చదువుకుని, సంపాదించి కుటుంబాన్ని చూసుకోవాల్సిన వంశోద్ధారకుడు.. మగాడు వాడి గురించి దిగులు పడాల్సిన పనిలేదు అనుకుంటాడు తండ్రి. కాని కూతురు అనగానే ఎన్నో భయాలు, జాగ్రత్తలు. తన కన్నబిడ్డలో తన కన్న తల్లిని, ఆ జగన్మాతను చూసుకుంటాడు. అల్లారుముద్దుగా అడిగినవన్నీ కొనిస్తాడు. ఎప్పటికైనా ఒక ఇంటికి వెళ్ళే ఆ చిన్నారిని అపురూపంగా పెంచుకుంటాడు. పిల్లలందరినీ సమానంగా ప్రేమించినా తండ్రికి కూతురిమీద ప్రేమ రవ్వంత ఎక్కువే. అల్లారుముద్దుగా పెంచి, పెద్ద చేసి చదువుచెప్పించడంతోపాటు ఆమెకు తగిన వరుడిని వెతికి పెళ్లిచేయడం అనేది తండ్రి బాధ్యతే కదా.



తన కూతురికి దొరికే అబ్బాయి ఎలాంటివాడో, ఆమెకు ఎటువంటి కష్టం కలగకుండా ప్రేమగా చూసుకుంటాడో లేదో, అడిగినవన్నీ ఇస్తాడో లేదో అనే బెంగ నిరంతరమూ వేధిస్తుంది. కూతురు చిన్నగా ఉన్నప్పటికనుండే ఆమె పెళ్ళి గురించి డబ్బులు వెనకేస్తాడు. అత్తవారింట్లో తన కూతురు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కాని ఈ ఆలోచనలన్నీ అతని మనసులోనే నిక్షిప్తమై ఉంటాయి. బయటకు చెప్పుకోడు, చర్చించడు. అప్పుడప్పుడు భార్యతో మాత్రం తన భావాలను పంచుకుంటాడు. తన కూతురిని ఎప్పటికీ కంటికిరెప్పలా చూసుకోలేడు కాబట్టి తనలా ప్రేమించి, కాపాడుకునే భర్తను ఆమె కోసం వెతికి తీసుకొస్తాడు. ఒకవేళ కూతురు ఎవరినైనా ప్రేమించానని చెప్పినా ఇవే అనుమానాలు. ఆ అనుమానాలు తీర్చుకునేదాకా పెళ్లికి ఒప్పుకోడు.



ప్రతి తండ్రి తన కూతురిని తన కంటే ఎక్కువ హోదాలో ఉండి తన బిడ్డకు ఎటువంటి లోటురాకుండా, ప్రేమగా చూసుకునేవాడు భర్తగా రావాలని కోరుకుంటాడు. ఈనాడు చాలామంది ఆస్తి, అంతస్థులకంటే కుటుంబ మర్యాద, చదువు, ఈడుజోడు ఉంటే చాలు తమ పిల్లనివ్వడానికి సరేనం టున్నారు. దీనికోసం తమ తాహతుకు మించిన కట్నం ఇవ్వడానికి కూడా వెనుకాడడంలేదు.



తండ్రీ కూతుళ్ళమధ్య అనుబంధం చెప్పాలంటే ఆ భావాలు భాషకు అతీతం. ముఖ్యంగా తన కూతురిని ఒక అయ్య చేతిలో పెట్టి కాపురానికి పంపుతున్నపుడు ఆ బాధ అనిర్వచనీయం. శకుంతలను అత్తవారింటికి పంపిస్తున్నపుడు కణ్వమహర్షి ఒక మాట అంటాడు. 34కేవలం పెంచిన తండ్రిని నాకే అమ్మాయి బయటకు వెళుతోందంటే ఇంత బాధగా వుందే.. మరింక కన్న తండ్రి బాధను ఎవరు చెప్పగలరు?-అని. ఆ అత్తవారిల్లు ఎలాంటిదో తెలుసుకుందుకు ఆ తండ్రి ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తాడో విక్రమ్‌సేథ్ రాసిన 3‘ద సూటబుల్ బాయ్’2కథ2 చదివితే తెలుస్తుంది. మనవాళ్ళు లోకరీతిలో ఒక మాట చెపుతూంటారు. 34్భర్యాభర్తలిద్దరూ ఒకరిమాట ఒకరు ఎప్పుడైనా వింటారా?2అనడిగితే... ఎందుకు వినరు? ఇల్లు కట్టేటపుడు భార్య మాట భర్త, పిల్లకి పెళ్లిచేసేటపుడు భర్త మాట భార్య వింటుంది2అని. అంటే దీని అర్థమేమిటంటే ఇల్లు ఎలా ఉండాలో ఇల్లాలికి తెలుస్తుంది, రాబోయే అల్లుడు ఎలా ఉండాలో తండ్రికి తెలుస్తుంది.. అని. అందుకని ప్రేమైకమూర్తి అయిన తండ్రికి కూతురి పెళ్లి బాధ్యత నిస్సంకోచంగా అప్పచెప్పెయ్యవచ్చు. ఎంత అభివృద్ధి చెందినా అత్తవారింట జరుగుతున్న అరాచకాలు, అకృత్యాలు మాత్రం తగ్గలేదు. ఇంకా కట్నం చావులు ఆగలేదు. అందుకే తన శక్తికి మించినదైనా అడిగినంత కట్నం ఇచ్చి పెళ్ళిచేయాలని ప్రతీ తండ్రీ కోరుకుంటున్నాడు. తర్వాత తను ఎన్ని కష్టాలు పడ్డా తన బిడ్డ సుఖంగా ఉంటే చాలనుకుంటాడు. కానీ కొందరు తండ్రులు మాత్రమే తమ కూతుళ్ళను సున్నిత మనస్కులుగా కాకుండా ధైర్యంగా, ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేలా ఉండాలని, ఎప్పుడుకూడా బేల కాకూడని చెబుతుంటారు.
కాలంతో పాటు ఈనాడు తండ్రులు కూడా మారుతున్నారు అని చెప్పవచ్చు. కుటుంబ నిర్వహణకు తనకు తోడుగా భార్య కూడా సాయపడుతున్నపుడు తానెందుకు ఆమెకు సాయపడకూడదు అని పిల్లల బాధ్యత, పెంపకం గురించి చిన్నప్పటినుంచే తండ్రి తెలుసుకుంటున్నాడు. వాళ్ళకు తినిపించడం నుండి చదివించడం, ఆడించడం అన్నీ చేస్తున్నాడు. పిల్లల పొరపాట్లను సరిదిద్దటంలో కూడా తల్లి గారాబం, మెతకతనం చూపిస్తుంది. అదే, తండ్రి విషయానికి వస్తేవారి మాటలు, చర్యలు దృఢంగా ఉంటాయి. తండ్రి మాటలు, చేతలలో స్థిరత్వం, మందలింపులో కఠినత్వంతోపాటు అనురాగం కూడా ఉంటాయి. తండ్రి పిల్లలకు మమతతో పాటు, క్రమశిక్షణనూ నేర్పిస్తాడు. పిల్లలు స్కూలుకు వెళ్లకుండా ఎగ్గొట్టటానికి అనేక కారణాలు చెప్తున్నపుడు తల్లి మెత్తబడవచ్చు కానీ, తండ్రి నిర్ణయంలో మార్పు రాదు. తల్లిదండ్రులిద్దరూ తమ పిల్లల బాగుకోరేవారే అయినప్పటికీ తండ్రి పిల్లలతో వ్యవహరించే తీరు, తల్లి పెంపకానికి భిన్నంగా ఉంటుంది. పిల్లల విషయంలో తండ్రి మెత్తపడడు, రాజీ ధోరణిని అవలంభించడు. అందుకే చాలామంది పిల్లలు తండ్రితో మాట్లాడటానికి జంకుతారు. అమ్మకు చెప్పి అడిగిస్తారు. ఇది భయంతో కూడిన గౌరవం. తండ్రి గారాబం చేసినా, తప్పు చేస్తే మన్నించడని పిల్లలు జాగ్రత్త వహిస్తారు. తండ్రితో సాన్నిహిత్యం పెరుగుతున్న కొద్దీ, తండ్రి మాటలకు ప్రభావితులై తమ ప్రవర్తనను తామే సరిదిద్దుకోగలుగుతారు.



పూర్వకాలంలో ఆడపిల్లకు చాకలి పద్దులు రాసేంత చదువు వస్తే చాలు, ఎంత చదివినా ఆడపిల్ల వంటింట్లోనే మగ్గిపోవాల్సిందే కదా అని పెద్ద చదువులు చదివించలేదు. కాని నేడు కూతురు, కొడుకు అనే తేడా లేకుండా చదివిస్తున్నారు. తన కూతురు పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగస్థురాలు కావాలి, అందరిలో పేరు తెచ్చుకోవాలి అనుకుంటున్నారు తల్లితండ్రులు. కూతురికి కట్నం ఇచ్చి పెళ్లి చేయడం కంటే అదే డబ్బుతో ఆమెను పెద్ద చదువులు చదివించి ప్రయోజకురాలిని చేసి ఉన్నత స్థానంలో ఉండేలా చేయాలనుకుంటున్నాడు తండ్రి. అమ్మాయిలు కూడా ఎందులోనూ తక్కువ కారు. ఎవరి మీదా ఆధారపడకూడదు, తన కాళ్ళమీద తాను నిలబడి ఒక మంచి పదవిలో ఉండాలని కోరుకుంటున్నాడు తండ్రి. కొడుకు ప్రయోజకుడై తమను ఆదుకుంటాడు అని అనుకోవడంతోపాటు కూతురు ప్రయోజకురాలై తనను, తన కుటుంబాన్ని చూసుకుంటుంది అని అనుకుంటున్నారు. ప్రతి తండ్రికి తన కొడుకులు, కూతుళ్లు ఇద్దరిపై సమానమైన ప్రేమ ఉంటుంది. కాని కూతురిమీద మమకారం ఎక్కువే.



తన ఆడబిడ్డ తన ఇంటి మహాలక్ష్మి నా తల్లి అని చెప్పుకుంటాడు తండ్రి. బంగారం, అమ్మ... అనే చెప్పుకుంటాడు. అనుక్షణం ఆమెకు తోడుగా ఉండాలని కోరుకుంటాడు. ఈ మధ్యే విజయవాడలో నాగవైష్ణవి అనే చిన్నారి దారుణంగా హత్యకు గురైనపుడు అంతులేని విషాదానికి లోనై ఆమె తండ్రి ప్రభాకర్ గుండె పగిలి కూతురితో పాటు అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ఇక, పెళ్ళై మరో ఇంటికి వెళ్లిపోయినా కూతురిమీద బెంగగానే ఉంటుంది తండ్రికి. ఎలా ఉందో, అత్తవారింట ఆమె అడిగినవన్నీ ఇస్తున్నారో లేదో, ఆమెను ఏ కష్టమూ రాకుండా చూసుకుంటారో లేదో అన్న బెంగ అతడ్ని సతాయిస్తూనే ఉంటుంది. అంతా బావుంటే ఫర్లేదు కానీ అత్తారింట కష్టాలు పడుతున్న కూతురి గురించి తెలిస్తే ఆ తండ్రి గుండె పగిలిపోతుంది. ఎటువంటి బాధలైనా మహిళ బయటకు చెప్పుకుని బిగ్గరగా ఏడ్చి తన భారాన్ని దింపుకుంటుంది కాని మగవాడు ఏడ్వకూడదు అంటారు కదా. ఆ మనోవేదన తన గుండెల్లో రగులుతుండగా దుఃఖాన్ని దాచుకుని కుమిలిపోతాడు తండ్రి.. అలా అని తండ్రులందరూ మంచివారే అనలేము. కుమార్తెల పట్ల అసహజంగా ప్రవర్తించే తండ్రులూ అక్కడక్కడ ఉన్నారు. వేరే కులంవాడిని ప్రేమించిందని సొంత కూతురిని అంతం చేసిన తండ్రులూ ఉన్నారు. కట్నం ఇవ్వాలి, ఖర్చుపెట్టాలి గనుక ఆడపిల్లల్నే వద్దనుకునేవారు ఇంకా మన సమాజంలో ఉన్నారు. వంశోద్ధారకుడిని చదివించి తన కష్టార్జితాన్ని రాసిచ్చినా జీవితపు చరమాంకంలో వృద్ధాశ్రమంలో పడేసి, లేదా ఇంటినుండి తన్ని తగలేసే కొడుకులు కోకొల్లలు మన దేశంలో. అత్తారింట తనకు అధికారం లేకున్నా తల్లిదండ్రుల పట్ల ప్రేమగా ఉండేది కూతురే కదా. అందుకే అన్నారు కంటే కూతుర్నే కను అని.



కవులు కూడా తమ రచనలను కన్నకూతురిలా భావించి, కాసులకు ఆశించి మహరాజులకు అంకితమీయకుండా సాక్షాత్తూ ఆ దేవదేవుడికే అంకితమిచ్చారు. పోతన తన భాగవత మహాకావ్యాన్ని శ్రీ మహావిష్ణువుకు అంకితమిస్తూ ఇలా అన్నాడు.



ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములుః గొన్ని పుచ్చుకుని చొక్కి శరీరము వాసి కాలుచే
సమ్మెట వ్రేటులం బడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పె నీ
బమ్మెరపోతరాజొకఃడు భాగవతంబు జగద్దితంబుగన్



అధములైన రాజులకు అంకితమిచ్చి వారిచే పురములు, వాహనములు, సొమ్ములు పుచ్చుకుని తదనంతరం కష్టాలు పడడం ఇష్టంలేక నా భాగవతాన్ని మనస్ఫూర్తిగా ఆ శ్రీహరికే అంకితమిస్తున్నాను. అంతకంటే గొప్పవాడైన కృతికర్త ఉండునా? - అని పోతన తన భావాన్ని తెలిపాడు.



Categories: Middle

అల్లసాని వారి అద్భుత వృత్తమాలిక

Thu, 01/19/2012 - 11:43

శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాధీశుడు. ఈయన పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండడమే కాక సాహిత్యానికి కూడా పెద్ద పీట వేయబడింది.ఈయన ఆంధ్రభోజుని గా మరియు కన్నడరాజ్య రమారమణగా కీర్తించబడ్డాడు. రాయలు స్వయంగా కవి, పండితుడు కూడా. అతను స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము, తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు. రాయలుకు సాహితీ సమరాంగన సార్వభౌముడు అనే బిరుదు కలిగినవాడు కూడా. రాయల ఆస్థానానికి భువన విజయం అనే పేరుంది. ఈ భువనవిజయంలో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు (భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది కవులు ఉన్నారు. వారు అష్టదిగ్గజాలుగా ప్రసిద్ధి పొందారు. వీరందరిలో రాయలు ఆస్థానకవి, ఆంతరంగికుడుగా మసలిన అల్లసాని పెద్దన ఆంధ్రకవితా పితామహునిగా పేరు పొందాడు. భువన విజయంలో ఇతనికి జరిగినన్ని మర్యాదలు, సత్కారాలు మరే కవికి దక్కలేదన్నది సత్యం.

ఒకనాడు రాయలు భువనవిజయంలో బంగారు పళ్లెంలో పెట్టిన గండపెండేరాన్ని తెప్పించి సంస్కృతాంధ్రాలలో సమానంగా కవిత్వం చెప్పగలిగే వారు ఉంటే వచ్చి అందుకోమని చెప్పాడు. సభలో కవులందరూ మౌనంగా ఉన్నారు. అప్పుడు రాయలు ఆశ్చర్యంగా

ఉ. ముద్దుగ గండపెండెరమున్ గొనుడంచు బహూకరింపగ
నొద్దిక "నాకొసంగు"మని యొక్కరుఁ గోరగలేరు లేరొకో?"

నేను సంతోషంగా ఈ గండపెండేరాన్ని బహుమతిగా ఇస్తాను అంటే ఒక్కరు కూడా నాకివ్వమని అని కోరడం లేదు ఎందుకో?

అప్పుడు పెద్దన లేచి

పెద్దన బోలు పండితులు పృధ్విని లేరని నెవెఱుంగవే?
పెద్దన కీదలంచినను బేరిమి నాకిడు కృష్ణరాణ్ణృపా!

రాజా! ఈ భూమండలంలో ఈ పెద్దన కంటే గొప్ప పండితుడు లేరని నీకు తెలీదా? నాకు ఇవ్వదలచిన వెంటనే ఇవ్వు అని అన్నాడు పెద్దన. తన పాండిత్యం మీద ఆయనకంత నమ్మకం మరి..

వెంటనే తన పాండిత్యాన్ని నిరూపించుకోవడానికి సంస్కృత, ఆంధ్రములో ఆశువుగా పెద్దన యీ ఉత్పలమాలిక చెప్పాడు. ఇది మామూలుగా నాలుగు పాదాలతో ఉండే వృత్తం కాదు. వృత్త మాలిక. అంటే అదే వృత్తం ప్రాసని భావాన్ని విడకుండా నిరాఘాటంగా అది వృత్తమాలిక అనబడుతుంది. కవికి భావావేశంలో అతడు చెప్పే వృత్తం ఆగకుండా నిరర్గళంగా సాగిపోతుందన్నమాట. అసలు, కవిత్వమంటే ఎలా ఉండాలో కవితాత్మకంగా శబ్దార్థాల మేలికలయికతో యిందులో చెప్పబడింది. ఈ పద్యానికి అర్థం చెప్పుకోవాలంటే కొంత శ్రమపడాలి. దీనికి వేల్చేరు నారాయణరావుగారు చేసిన ఆంగ్ల అనువాదం ఇక్కడ చూడవచ్చు: ఈ అద్భుత పద్యం యొక్క శ్రవ్యకాన్ని ఇక్కడ వినొచ్చు.. ఒళ్ళు గగుర్పొడించే ఈ వృత్తమాలిక వినగానే శ్రీకృష్ణదేవరాయలు లేచి వచ్చి స్వయంగా తానే పెద్దన కాలికి గండపెండేరం తొడిగాడు.





Normal 0 false false false EN-US X-NONE TE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:"Table Normal"; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-parent:""; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin-top:0in; mso-para-margin-right:0in; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0in; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:"Calibri","sans-serif"; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-bidi-font-family:Gautami; mso-bidi-theme-font:minor-bidi;}

పూఁత మెఱుంగులుం బసరుపూఁప బెడంగులుఁ జూపునట్టివా


కైతలు? జగ్గు నిగ్గు నెనగావలెఁ గమ్మనఁ గమ్మనన్వలెన్


రాతిరియున్ బవల్ మఱపురాని హొయల్ చెలి యారజంపు ని


ద్దా తరితీపులో యనఁగఁ దారసిలన్వలె లోఁ దలంచినన్


బాఁతిగఁ బై కొనన్ వలెను బైదలి కుత్తుకలోని పల్లటీ


కూఁతలనన్వలెన్ సొగసుకోర్కులు రావలె నాలకించినన్


జేతికొలందిఁ గౌగిటను జేర్చిన కన్నియ చిన్ని పొన్ని మే


ల్మూఁతల చన్నుదోయివలె ముచ్చటగావలెఁ బట్టిచూచినన్


డాతొడనున్న మిన్నులమిటారపు ముద్దులగుమ్మ కమ్మనౌ


వాతెఱదొండపండువలె వాచవిగావలెఁ బంటనూదినన్


గాతలఁ దమ్మిచూలిదొర కైవసపుం జవరాలి సిబ్బెపు


న్మేతెలి యబ్బురంపు జిగి నిబ్బర పుబ్బగు గబ్బిగుబ్బపొం


బూఁతల నున్న కాయ సరిపోఁడిమి కిన్నెర మెట్లబంతి సం


గాతపు సన్నతంతి బయకారపుఁ గన్నడ గౌళపంతుకా


సాతత తానతానలపసన్ దివుటాడెడు గోటమీటు బల్


మ్రోతలునుంబలెన్ హరువు మొల్లముగావలె నచ్చతెన్గు లీ


రీతిగ సంస్కృతంబు పచరించెడు పట్టున భారతీవధూ


టీ తపనీయగర్భనికటీ భవ దాననపర్వసాహితీ


భౌతిక నాటకప్రకర భారత భారత సమ్మతప్రభా


శీతనగాత్మజా గిరిశశేఖర శీత మయూఖరేఖికా


పాతసుధాప్రపూర్ణ బహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ


జాతక తాళయుగ్మ లయసంగతి చుంచు విపంచికా మృదం


గాతత తేహితత్తహిత హాధితధంధణుధాణుధింధిమి


వ్రాతనయానుకూల పదవారకుహూద్వహ హారికింకిణీ


నూతనఘల్ఘలా చరణనూపుర ఝూళఝుళీ మరందసం


ఘాతవియద్ధునీ చకచక ద్వికచోత్పలసారసంగ్రహా


యాత కుమారగంధవహహారి సుగంధ విలాసయుక్తమై


చేతము చల్లఁజేయవలె జిల్లన జల్లవలెన్ మనోహర


ద్యోతకగోస్తనీఫలమధుద్రవ గోఘృతపాయసప్రసా


రాతిరసప్రసారరుచిరప్రసరంబుగ సారె సారెకున్।



ఈ వృత్త మాలిక అర్ధం ఆంగ్లంలో..

Is poetry a surface sheen,
the green delusion of unfolded buds?
It must be real inside
and out, exploding fragrance,
an aching touch your body can't forget
by day or night, like of your woman,
whenever you think about it.
It should come over you, it should murmur
deep in the throat, as your lover in her dove-like moaning,
and as you listen, yearning comes in all its beauty.
If you take hold of it, your fingers tingle
as if you were tracing the still-hidden breasts
of a young girl, wholly embraced.
If you sink your teeth into it, it should be succulent
as the full lips of a ripe woman from another world,
sitting on your knees. It should ring
as when godly Sound strokes with her fingernails
the strings of her veeNa, with its golden bulbs resting
on her proud, white, pointed breasts,
so that the rAga-notes resound.
That is the pure Telugu mode.


If you use Sanskrit, then a rushing, gushing
overflow of moonlight waves, luminous and cool,
from Siva's crest, the mountain-born goddess beside him,
enveloping actors and their works, the dramas
spoken by Speech herself in the presence of the golden seed,
pounding out the powerful rhythms, the beat
of being, through drums and strings
and chiming bells and thousands of ringing anklets
dancing, drawing out the words, the fragrant and subtle
winds wafting essence of unfolding lotus
from the Ganges steaming in the sky should
comfort your mind. You should shiver
in pleasure again and again, each time
you hear it, as rivulets of honeyed juices and butter
and sweet milk flow together
and mix their goodness more and more
and more.


ఈ టపా విషయంలో సందేహాలు తీర్చిన చింతా రామక్రిష్ణగారికి, భైరవభట్ల కామేశ్వరరావుగారికి ధన్యవాదాలు.



Categories: Middle

ఇంతలోనే ఎంత వారయ్యారు??

Wed, 01/18/2012 - 13:48

Normal 0 false false false EN-US X-NONE TE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:"Table Normal"; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-parent:""; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin-top:0in; mso-para-margin-right:0in; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0in; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:"Calibri","sans-serif"; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-bidi-font-family:Gautami; mso-bidi-theme-font:minor-bidi;}

బుడి బుడి అడుగులతో ఇల్లంతా తిరుగుతూ


ఏడుపులు, అల్లరితో కేరింతలు కొడుతూ


అన్నం తిందురా అంటే నాకొద్దు పో అని విసిగిస్తూ


స్కూలు కెళ్లాలి లేమ్మా అంటే నేను పోను అని మారాం చేసే పిల్లలు


అమ్మ మాటలతో, నాన్న లాలనతో ఎదుగుతూ


ఆటపాటలతోపాటు జీవిత పాఠాలు కూడా నేర్చుకుంటూ


ఇంతలా ఉన్నవారు అప్పుడే ఎంతలా ఎదిగిపోయారు


గువ్వలా పొదుముకుని కాపాడుకున్న చిన్నారులు


పెద్దలనే పిల్లలను చేసి మేమున్నాం కదా అంటున్నారు.


ఎంత అల్లరి చేసినా అమ్మ కంట కన్నీరు చూడలేని ఆ చిన్ని మనసులు


కన్నీటికర్ధం తెలీకున్నాతమ బుజ్జి బుజ్జి చేతులతో తుడిచేసారానాడు

చెప్పకనే అమ్మ మనసు తెలుసుకుని చేతులతో ఆమెను బంధించి అదిలిస్తారీనాడు..

ఈ బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలాగే ఉండేనా??


ఈ అనుభూతిని పదిలపరుచుకున్న ఈ క్షణం ఇలా స్తంభించిపోదా....

Categories: Middle

మాలిక సంక్రాంతి సంచికకు స్వాగతం

Sun, 01/15/2012 - 03:11

అందరికీ నూతన సంవత్సర , మకర సంక్రాంతి శుభాకాంక్షలు.


మాలిక పత్రిక సంక్రాంతి సంచిక విడుదల అయింది. ఈ సంక్రాంతి సంచికను ప్రత్యేక హాస్య సంచికగా తయారు చేయడమైనది. ఈ సంచికలోని కబుర్లు, కథలు మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాము. ఈ హాస్య సంచిక నిర్వహణ బాధ్యత మాలిక టీమ్ సభ్యురాలు సుజాత గారిదే.


మరో ముఖ్య సమాచారం. ఈ సంచికతో మాలిక పత్రిక తన మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా మాలిక సంపాదక బృందానికి, తమ అమూల్యమైన రచనలను అందిస్తున్న రచయితలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. పడండి మరి ఈ ప్రత్యేక హాస్య సంచికలో ఏమేమి ఉన్నాయో చూద్దాం..


URL: http://magazine.maalika.org


మీ రచనలు పంపడానికి చిరునామా: editor@maalika.org

0. సంపాదకీయం: సంక్రాంతి పండుగ

1. తెలుగు సినిమాలో హాస్యం

2. సహస్ర స్క్వైర్ అవధానం …..

3. తెలుగు పండితుడి మసాలా పాట!

4. ఇదేమైనా బాగుందా??

5. డూప్లెక్స్ భోగం

6. రేడియో చమత్కారాలు

7. అల్లరి కార్టూన్ల శ్రీవల్లి!

8. చింతామణి -సినిమా గోల

9. తెలివైన దొంగ

10. సెంట్ ఫకీర్ తెలుగు మీడియం ఇంగ్లీష్ కాన్వెంట్!

11. నేను నా పాట్లు (పాటలు)

12. ఒక ప్రయాణం – ఒక పరిచయం

13. ద బెస్ట్ ఆఫ్ బాపు కార్టూన్స్ !

14. రాముని మిత్రధర్మము

15. మాలికా పదచంద్రిక – 5: రూ. 1000 బహుమతి: ఆఖరు తేదీ ఫిబ్రవరి 20

16. బ్లాగ్గడి – తెలుగు బ్లాగర్లకు ప్రత్యేకం – రూ 200 విలువగల బహుమానం: ఆఖరు తేదీ ఫిబ్రవరి 20
Categories: Middle

Happy Birthday Jo

Wed, 12/21/2011 - 18:06

ఒక చోట అందరూ గుమిగూడి ఉన్నారు. కిందకు నీళ్ళలోకి తొంగి చూస్తున్నారు. ఇంతలో ఒకబ్బాయి నీళ్ళలో దూకాడు. ముందు మునిగిపోయినా మెల్లిగా ఈదుకుంటూ పైకి వచ్చాడు. అందరూ అతన్ని అభినందించారు.. కాని అతను మాత్రం కోపంగా అరిచాడు.. ఎవర్రా ? నన్ను నీళ్ళలో తోసింది? నాకు అసలే ఈత రాదు. ఏదో ప్రాణభయంతో కాళ్ళు చేతులు ఆడిస్తూ పైకి వచ్చా."""




ఈ కథ ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా?? ఏం లేదండి కొద్ది రోజులుగా ఊరికే ఇదే ఆలోచన వస్తుంది. అసలు హాయిగా టీవీ సీరియళ్లు చూసుకుంటూ టైం పాస్ చేసేదాన్ని . ఊరికే టీవీ ముందు సెటిల్ అవుతున్నానని నెట్ లోకి తోసేసారు మావారు , కొడుకు. ఇక్కడ కూడా రాయమంటూ ప్రోత్సహించి ముందుకు తోసారు తోటి బ్లాగర్లు. సరే అని ఏదో తోచింది రాసుకుంటుంటే పత్రికల్లో రాయమన్నారు .. సరే అని అది ట్రై చేశా.. యిపుడు బ్లాగు రాయడం సంగతి ఏమో కాని ఇంట్లో కూడా తీరడం లేదు. ఎవరితో కలవడానికి కూడా టైం సరిపోవడం లేదు. అందరూ తిడుతున్నారు. అసలు ఉన్నావా లేదా అని. ప్చ్.. ఏం చేయను. అందుకే అప్పుడపుడు అనుకుంటాను ఎవర్రా నన్ను రాయమని తోసింది అని...



కాని .. ఈ జాలం వల్ల నాకు ఎంతో మంది వ్యక్తులు పరిచయమై ఆత్మీయ స్నేహితులుగా మారారు. ఒక్కోసారి ఆ అభిమానం, ఆప్యాయత, గౌరవం చూస్తుంటే ఆశ్చర్యంగా, విస్మయంగా ఉంటుంది. ఏమిటీ సంబంధం?, ఎందుకీ అనుబంధం?.. వారంతా సంతోషంలో, బాధలో నాకు తోడుగా ఉండి నాతో పాటు సంతోషించారు, ఓదార్చారు. తప్పులుంటే ఎత్తి చూపారు. సరిదిద్దారు. వంట, ఇల్లు, పిల్లలు , కుటుంబం తప్ప వేరే తెలీని, పెద్ద చదువులు లేని నన్నుఈ స్థాయికి చేరుకోవడానికి, నాకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోవడానికి ప్రోత్సహించిన వారందరికీ నా పుట్టినరోజు సందర్భంగా హృదయ పూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇంతకంటే ఏమివ్వగలను??? సామాన్య గృహిణి నుండి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా మారడానికి సహకరించిన పెద్దలకు నమస్సులు. అంతేకాక ఈ ఏడాది చాలా బాగా గడిచింది. అమ్మాయి పెళ్లి బాగా జరిగింది. తను సంతోషంగా ఉంది. అబ్బాయి కూడా మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. అమ్మాయి దూరంగా ఉన్నా అబ్బాయి ఇక్కడే మాతోనే ఉన్నాడు. సో హ్యాపీస్..




అసలు పుట్టినరోజు అంటే జీవితంలో ఒక ఏడాది తరిగిపోవడమే. అందులో చెప్పుకోవడానికి ఏముందని? .. పదిమందికి ఉపయోగపడితేనే ఆ పుట్టినరోజుకు ఆ జన్మకు సార్ధకత లభిస్తుంది. ఇలా అంటున్నాను కదా అని నా ప్రయాణం ఇంతటితో అయిపోయిందని అనుకోవడం లేదు. ఇంకా ముందుముందు ఏం జరుగుతుందో కూడా ఆలోచించ దలుచుకోలేదు. ఆంతా ఆ జగన్మాత దయ. ఎలా తీసికెళ్తే అలా వెళ్ళిపోవడమే..
Categories: Middle

వెచ్చదనం పంచాలని ఉందా?

Wed, 12/21/2011 - 06:21



TMAD వాళ్ళు చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రమదావనం తన వంతు సాయం చేస్తుంది. మీలో ఎవరైనా సాయం చేయాలనుకుంటే ప్రశాంతికి మెయిల్ పెట్టండి . ఈ దుప్పట్ల పంపిణీలో మీరు కూడా పాల్గొనవచ్చు.
prasanthi.uppalapati@gmail.com


Greetings!! Taken up blanket distribution project again. This time we want to give in M N J Cancer Hospital. Now that we are going to end the year, I thought people might have some fund reserved for service activities and being winter, blanket distribution is one ideal project which people consider. Pl. go through this URL: http://wp.me/p1Epu-30 We, TMAD, want to distribute a minimum of 100 blankets to the patients who stay in M N J Oncology Center shelter for radiation treatment. The minimum requirement is 200 but we are trying to raise money for at least 100 blankets. Each blanket cost would be Rs. 115 (from our regular supplier). We are trying other sources as well. The price can be Rs. 100 to Rs. 105. Not sure yet. If we assume the price would be Rs. 115 only, we should raise Rs. 11,500 for 100 blankets and Rs. 23,000. TO MAKE A DIFFERENCE (TMAD)
A/C No: 000801210382
Bank: ICICI Bank Limited
Branch: CIBD (Khairatabad)
NEFT/IFSC/RTGS Code: ICIC0000008
Pl. send mail to tmad.finance@gmail.com with the subject line as: For Blankets in M N J, with the transaction details, as soon as you transfer the amount. We will confirm the transaction within 48 hrs and send the receipt within 15 days. We have 80G Tax Exemption.
Categories: Middle

బ్నిం గారితో రేడియో జోష్ ముచ్చట్లు

Thu, 12/15/2011 - 03:54

రేడియో జోష్...



ఇవాల్టి నుండి వరుసగా నాలుగు రోజుల పాటు స్టేట్ ఆర్ట్ గ్యాలరీ మాదాపూర్ లో కలర్ స్కేప్స్ అనే పేరుతో ముఖీ మీడియా వారి సౌజన్యంతో చిత్రకళా ప్రదర్సన ఏర్పాటు చేయబడుతుంది. ఈ కళాప్రదర్శనలో వేర్వేరు ప్రాంతాల నుండి వచ్చిన సుమారు 40 మంది చిత్రకారుల 400 పైగా చిత్రాలను ప్రదర్శనలో ఉంచుతున్నారు. ప్రముఖ చిత్రకారుడు , దర్శకుడు బాపుగారి జన్మదిన సందర్భంగా ఈరోజు సాయంత్రం ఈ కళాప్రదర్శన ప్రారంభించబడుతుంది. ఈ చిత్రాలన్నీ ప్రదర్శనకే కాకుండా అమ్మకాలు కూడా ఉంటాయని నిర్వాహకులు ముఖీ మీడియా వారు తెలియచేసారు. ఈ కళా ప్రదర్శనకు రేడియో జోష్ రేడియో పార్టనర్ గా ఉంది.. ఈ రోజు సాయంత్రం జరిగే ప్రారంభ కార్యక్రమ విశేషాలు రేడియో జోష్ లో ప్రత్యక్షంగా వినొచ్చు.. ఈ సందర్భంగా నాలుగు రోజుల క్రింద అంటే ఆదివారం సాయంత్రం ముఖీ మీడియా CEO పావని ప్రసాద్ గారు, ప్రముఖ రచయిత,కార్టూనిస్ట్ బ్నిం గారు రేడియో జోష్ స్టూడియోకి వచ్చారు. ఆ ఇంటర్వ్యూ మీరు వినండి మరి..

ఒక surprise.... ఈ ఇంటర్వ్యూలో మనందరికీ ఇష్టమైన వ్యక్తి ఒకరు వచ్చి కొన్ని ముచట్లు చెప్తున్నారు మరి..





రేడియో జోష్ లో ప్రతీ ఆదివారం సాయంత్రం 7.30 గంటలకు బ్నిం ఆడియో కథలు ప్రసారం చేయబడతాయి. మర్చిపోకుండా వినండి..
Categories: Middle

మాలిక పదచంద్రిక - 4 ఫలితాలు

Thu, 12/15/2011 - 03:22

మాలికా పదచంద్రిక - 4 కు ఆరుగురు సమాధానాలను పంపారు. బి.పద్మావతిగారు ఒక తప్పుతోనూ, భైరవభట్ల కామేశ్వరరావుగారు, భమిడిపాటి సూర్యలక్ష్మిగారు రెండేసి తప్పులతోనూ పూరించగలిగారు. ఇక అన్నీ సరిగ్గా పూరించి బహుమతికి అర్హులైవారు మాచర్ల హనుమంతరావు గారు, కంది శంకరయ్యగారు మరియు మానస చామర్తి గారు. వీరికి అభినందనలు. బహుమతి ఈ ముగ్గురికి సమానంగా ఇవ్వబడుతుంది.

విజేతలు editor@maalika.org కి మీ చిరునామాలు పంపండి.
Categories: Middle

పాఠకుడి దగ్గరకు పుస్తకం... సుపధ

Tue, 12/13/2011 - 03:16

Normal 0 false false false EN-US X-NONE TE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:"Table Normal"; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-parent:""; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin-top:0in; mso-para-margin-right:0in; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0in; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:"Calibri","sans-serif"; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-bidi-font-family:Gautami; mso-bidi-theme-font:minor-bidi;}

సుపధ :


కొన్నేళ్లుగా ప్రతీ సంవత్సరం డిసెంబర్ నెల రాగానే చదివే అలవాటు ఉన్నవారికి, హైదరాబాదులో ఉన్నవారికి గుర్తొచ్చేది, ఎదురు చూసేది ఏంటి? పుస్తకాల పండగ అదేనండి పుస్తక ప్రదర్శన..


పుస్తకాలు చదవడం అందరికీ ఇష్టమే. క్లాసు పుస్తకాలైతే ఎలాగూ తప్పవనుకోండి. చదువు, వృత్తికి సంబంధించిన పుస్తకాలే కాకుండా మనకు నచ్చిన అంశాల మీద మరింతగా తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. దానికోసం వీలైనన్ని పుస్తకాలు కొంటుంటాము. అవి సంగీతం, సాహిత్యం, పిల్లల కథలు, వంటలు, కుట్లు అల్లికలు, ఆరోగ్యం, ఆధ్యాత్మికం మొదలైనవెన్నో అంశాల మీద రాసిన పుస్తకాలు ఉంటాయి. వీటిని కొనుక్కోవడానికి పుస్తకాల షాపుకు వెళ్లాల్సిందే .. లేదా ఏడాదికోసారి ప్రముఖ పట్టణాలలో ఏర్పాటు చేసే పుస్తక ప్రదర్శనల్లో తమకు కావలసిన, నచ్చిన పుస్తకాలు దొరుకుతాయేమో అని వెతుక్కోవాలి. ప్రతీ నగరంలో కూడా పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారు ప్రతీ కాలనీలో, వీధిలో ఉంటారు . కాని ఆ పుస్తకాలు కొనడానికి దుకాణాలు మాత్రం కొన్ని చోట్లే ఉన్నాయి. ఉదా. దిల్‌షుక్ నగర్, లేదా BHEL, ECIL లో ఉన్నవారికి ఏదైన పుస్తకం కావాలంటే కోటీలోని విశాలాంధ్ర, లేదా నవయుగ, నవోదయకు రావాల్సిందే. మధ్యలో కొన్ని ఉంటాయి కాని అన్ని పుస్తకాలు దొరక్కపోవచ్చు. అడ్రస్ తెలియకపోవచ్చు. అలాంటప్పుడు ఎంత దూరమైనా వెళ్లక తప్పదు కదా. అప్పుడప్పుడు పావల కోడికి ముప్పావలా మసాలా అన్నట్టు అవుతుంది కూడా. అందుకని ఒకేసారి కనీసం పది పుస్తకాలైనా కొనేట్టుగా డబ్బులు జమచేసుకుని, సమయం చూసుకుని, ప్రయాణం పెట్టుకోవాల్సి ఉంటుంది. అంతవరకు ఆ పుస్తకం చదవాలనే కోరికను ఆపుకోవాల్సిందే.


ఈ మధ్య పుస్తకాలు చదివే అలవాటు చాలా తగ్గిపోయింది అంటున్నారు కాని అది తప్పేమో?... చదివేవాళ్లూ ఉన్నారు, రాసే వాళ్లూ ఉన్నారు. ప్రతీ దిన,వార, మాసపత్రికల్లో ఎన్నో కొత్త పుస్తకాల సమీక్షలు, పరిచయాలు వస్తూనే ఉన్నాయి కదా. అవి ఎంత వరకు అమ్ముడుపోతున్నాయో తెలీదు మరి. లక్షలు ఖర్చు పెట్టి తమ పుస్తకాలు అచ్చు వేయించుకున్నా కనీసం పెట్టిన ఖర్చైనా వస్తుందంటే డౌటే. చాలా వరకు స్నేహితులు, తెలిసినవాళ్లకు ఉచితంగానే ఇస్తారు రచయితలు. మిగిలినవి ఇంట్లో అట్టి పెట్టుకుంటారు. ఎవరో కొందరు పేరు పొందినవారి రచనలు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయనుకోండి. అది వేరే మాట. అచ్చైన పుస్తకాలన్నీ మనకు తెలివు. తెలిసినా కొనలేము. అన్నీ అన్ని చోట్లా దొరకవు. ప్రముఖ నగరాల్లో ఉన్నవారు ఉన్న కొద్ది షాపుల్లో గాని, పుస్తక ప్రదర్శనల్లో కాని కొనేసుకుంటారు. కాని వేరే ప్రాంతాల్లో , విదేశాల్లో ఉన్నవారి సంగతేంటి?? ఈ మధ్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ebooks .. పుస్తకాలను పిడిఎఫ్ లా ebooks చేసి పంపిణీ చెస్తున్నారు. కాని అస్తమానం కంప్యూటర్ ముందు మంచి పుస్తకం చదవాలంటే ఎవరికైనా విసుగే కాని గత్యంతరం లేక చదివే అలవాటు వదులుకోలేక అలా సర్దుకుపోతుంటారు. Amazon, AVKF ద్వారా కూడా తెలుగు పుస్తకాల పంపిణీ జరుగుతుంది. అది కొంచం ఖరీదైన వ్యవహారం.. ఎమెస్కో వాళ్లు చాలా ఏళ్ళుగా ఇంటింటికి గ్రంధాలయం అనే పధకం నడిపేవారు. ఏమో మరి ఈ మధ్య ఆ పధకం ఆపేసారు. అందులో వాళ్లు ఆయా నెలలో ప్రచురించిన, వారి దగ్గర ఉన్న పుస్తకాలు మాత్రమే మనం ఇంటికి తెప్పించుకోగలం..


అలా కాకుండా మనకు నచ్చిన పుస్తకాన్ని ఇంట్లో కూర్చునే ఆర్డర్ చేసి ఎక్కువ ఖరీదు కట్టకుండానే ఇంటికి తెప్పించుకునే అవకాశం వస్తే ఎలాగుంటుంది??


ఈ సమస్యలకు తగిన పరిష్కారం లభించింది.


పల్లవి , తన్మయి అనే ఇద్దరమ్మాయిలు తమ ఉద్యోగాలతో విసిగిపోయి ఏదైన కొత్తగా చేయాలనుకుని సలహ కోసం తండ్రిని అడిగారు... అపుడు అయన చెప్పిన మాట ........... కోరుకున్న పుస్తకాన్ని కోరినవారి ఇంటికి చేర్చే పథకం ఆలోచించమన్నాను. తెలుగు పుస్తకాలు అమ్ముడుపోవు , పుస్తక ప్రచురణ ఆర్థికంగా గిట్టుబాటు కాదు అని నిర్ధారణకు వచ్చి రచయితలు , చిన్న పబ్లిషర్లు చాలామంది నిస్పృహ చెందుతున్న ఈ కాలంలో యువత ముందుకొచ్చి కొత్త ఆలోచనతో ,కొత్త మార్కెటింగ్ వ్యూహంతో ఏదైనా సీరియస్ గా చేపడితే తెలుగు సాహిత్యానికి ఎంతో కొంత మేలు జరుగుతుంది అని చెప్పారు. ఆ ఆలోచన అమలు చేసిన ఆ అమ్మాయిలు మొదలుపెట్టిన కొత్త వెబ్ సైట్... సుపథ


ఈ సైట్ మొదలుపెట్టడానికి గల కారణాల గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం..


ఇది మామూలు పుస్తకాల దుకాణం కాదు.పెద్ద పబ్లిషర్లకు,పెద్ద బుక్ సెల్లర్లకు పుస్తకాలను అమ్మిపెట్టి లాభపడటానికి దీన్ని మొదలెట్టలేదు. ప్రతి పుస్తకాల అంగడిలో రివాజుగా ప్రదర్శించే పుస్తకాలన్నిటినీ ఇక్కడ కూడా ఎక్కించటం మా ధ్యేయం కాదు. తెలుగు పుస్తకప్రచురణ ఇప్పుడున్న స్థితిలో రచనా వ్యాసంగం ఆర్థికంగా గిట్టుబాటుకాక , ప్రాచుర్యం పెద్దగా లేక అవస్థ పడుతున్న ఎందరో రచయితల సమస్యకు ఒక పరిష్కారం కనుగొనాలన్న ఆలోచన ఈ ప్రయత్నానికి ప్రేరణ.



నేరుగా రచయితలనుంచి ,చిన్న పబ్లిషర్ల నుంచి పుస్తకాలను సేకరించి ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ లోనూ ,ఇతర విధాలుగానూ విక్రయించి, క్రమప్రకారం రచయితలకు, లేదా వారికి సంబంధించిన పబ్లిషర్లకు చెల్లించాలని మా సంకల్పం. అలాగే లాభాపేక్ష లేక సేవాభావంతో మంచి పుస్తకాలను అతితక్కువ ధరకు అందిస్తున్నా, మార్కెటింగు మీద దృష్టి పెట్టే సావకాశంలేని పబ్లిక్, ప్రైవేట్ సంస్థలకు వీలైనమేరకు ఉపయోగపడాలని మా ఆశయం.ఒక్క మాటలో చెప్పాలంటే మంచి రచయితకు తోడ్పడి, మంచి పబ్లిషర్లకు సహాయపడి మంచి తెలుగు సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న ధ్యేయంతో ఏర్పరచిన రచయితల సహకార వేదిక ఇది.


ఎన్ని వేల పుస్తకాలను నెట్లోకి ఎక్కించామన్నది కాదు..ఎన్ని మంచి పుస్తకాలకు ప్రపంచ ప్రాచుర్యం కల్పించగలిగామన్నదే మాకు ముఖ్యం.అవకాశం ఉన్న మేరకు రచయితలను, ప్రచురణకర్తలను సంప్రదించి,కలిసి వచ్చినవారికి వచ్చినట్లు ఇక్కడ స్థానంకల్పించాం. మిగతా రచయితలకూ, పబ్లిషర్లకూ ఇదే మా స్వాగతం.




ఏది పడితే అది కాకుండా పుస్తకాల ఎంపికలో కనీస ప్రమాణాలను పాటించ దలిచాం. ఉండకూడదని మీరు భావించిన పుస్తకాలేవైనా ఇక్కడ మీకు కనపడినా ,ఫలానా పుస్తకాలు ఇక్కడ ఉండదగినవని మీరు అనుకున్నా దయచేసి మాకు రాయండి.


మీరు ప్రత్యేకంగా ఏదైనా పుస్తకం కొనాలని అనుకుంటూంటే దాన్ని ఇక్కడ అమ్మకానికి పెట్టకపొయినా ,దయచేసి మాకు రాయండి ( info@supatha.in). మార్కెట్లో ఉన్నా లేకున్నా ఎలాగైనా దాన్ని సంపాదించి మీకు పంపడానికి ప్రయత్నిస్తాం.



ప్రధానంగా తెలుగు పుస్తకాలకోసమే దీన్ని ఉద్దేశించినా,ఇతర భాషా గ్రంథాలకు చోటు పెట్టరాదన్న నిషేధం లేదు.మంచి పుస్తకాలు ఏ భాషలో ఉన్నా ఆయా రచయితలు,పబ్లిషర్లు కోరితే ఇక్కడ పెడతాం.



ఇంకా చాలా ఆలోచనలున్నాయి.



మీరు కూడా ఈ సైట్ చూసి పుస్తకాలు ఇంటికే తెప్పించుకోండి మరి.. ఇది ఆన్లైన్ అమ్మకాలు మాత్రమే కాదు. ముందు ముందు మరింతగా విస్తృత పరుస్తామని నిర్వాహకులు తెలియచేసారు..

మెయిల్ ఐడి : sales@supatha.in
durgapublications@gmail.com

ఫోన్:
9441257961
9441257962
9441257963


20052824.

Categories: Middle

ఆదిలక్ష్మి గారు వస్తున్నారంట...

Tue, 12/06/2011 - 03:26
ఆ భగవంతుని దయ వల్ల అమ్మ ఒడి బ్లాగర్ ఆదిలక్ష్మిగారు కోలుకున్నారు. త్వరలో బ్లాగు కూడా రాయడం మొదలుపెడతారంట.చందమామ రాజుగారు ఇచ్చిన సమాచారం ఇది.. బ్లాగు మిత్రులు ఆవిడకు కాల్ చేసి మాట్లాడితే మనమంతా ఆమెకు తోడుగా ఉన్నామని సంతోషిస్తారు..

మనందరికీ మంచివార్త. అమ్మ ఒడి ఆదిలక్ష్మి గారు స్వస్థత పొంది మళ్లీ మనముందుకు రావాలనుకుంటున్నారు. ఇవ్వాళే ఈ విషయం తెలిసింది. ఇన్నాళ్లుగా ఆమె వివరాలకోసం ప్రయత్నించినా దొరకలేదు. ఆదిలక్ష్మి గారి రచనలను, వారి కుటుంబాన్ని బాగా అబిమానించే రేణు కుమార్ గారు ఆమె వివరాలను తెలిపారు. ఆమె ప్రస్తుతం వికారాబాద్ సమీపంలోని ఓ అనాధాశ్రమంలో 50 మంది పిల్లల మధ్య జీవితం గడుపుతున్నారు.

పాప, భర్త.. జీవితంలో అన్నీ కోల్పోయి కూడా తేరుకుని మళ్లీ తన బ్లాగ్ నిర్వహణకు, రచనల కొనసాగింపుకోసం పట్టుదలతో ఉన్నారు. కూడూ, గూడూ కూడా లేని స్థితిలో ఇప్పుడు జీవిస్తున్నానని తన కంటూ ఒక జీవితం, ఉపాధి కల్పించుకుని బ్లాగ్ నిర్వహణను క్రమం తప్పకుండా సాగించాలని ఆమె బలంగా కోరుకుంటున్నారు. ఇటీవలే సెవెన్స్ సెన్స్ సినిమా చూసి రీఛార్జ్ అయ్యానని ఆమె అన్నారు. తొమ్మిది రాజ్యాలు కలిసి ఒక రాజ్యం మీద దాడి చేయడం యుద్ధం అనిపించుకోదని అది ద్రోహం, కుట్రపూరితమేనని ఆమె అన్వయించుకుని చెప్పారు. తన బ్లాగులో వైఎస్ మరణం తర్వాత రాజకీయ కథనాలు ఎక్కువగా జోడించానని, ఇప్పడు తాను కోలుకున్న తర్వాత హైందవమతంపై ముప్పేట దాడుల పర్యవసానాల గురించి విస్తృత రచనలకోసం ప్రణాళిక ఊహించుకుంటున్నానని బ్లాగ్ మిత్రుల సహాయం తనకు చాలా అవసరమని ఆమె ఫీలవుతున్నారు. మీకు వీలయితే ఆమె కొత్త ఫోన్‌నంబర్‌కు ఒకసారి కాల్ చేసి మాట్లాడగలరు.

9603419294


జీవని ప్రసాద్ గారు , మీరు గతంలో జీవని వారి నుంచి ఆమెకు స్కూల్‌లో ఉపాధి లభించే అవకాశం ఉందని చెప్పినట్లు గుర్తు. పునరుజ్జీవితం పొందిన ఆదిలక్ష్మి గారికి మీరు ఈ రకమైన చేయూతను ఇప్పించగలిగితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం.


తన రచనలు, టైపింగ్, టెక్నాలజీ వంటి విషయాల్లో ఆమె తన సహచరుడు లెనిన్ బాబు గారిపైనే పూర్తిగా ఆధారపడ్డారు కాబట్టి సెల్, కంప్యూటర్ టెక్నాలజీ రెండింటినీ తాను ఇప్పుడు ఓనమాల నుంచి నేర్చుకోవలసి ఉంటుందని ఆమె ఫీలింగ్. ఆమె గత కొన్నేళ్ళుగా అమ్మఒడి బ్లాగులో రాసిన వందలాది బృహత్ కథనాలను మొత్తంగా లెనిన్ బాబుగారే టైప్ చేశారట. ఇప్పుడు ఒంటరిగా మారడంతో అన్నీ ఈమె నే్ర్చుకోవలసి ఉంటుంది.

వీలైతే మీరు ఇవ్వాళే ఆమెకు కింది మొబైల్ నంబర్‌కు ఫోన్ చేసి మాట్లాడగలరు. ఆమెతో, ఆమె రచనలతో పరిచయస్తులుగా మనం చేసే గడ్డిపరక సహాయం కూడా ఆమెకు కొండంత అండగా నిలబడుతుందని నా ప్రగాఢ నమ్మకం. ఆమె తన స్వంత కష్టంతో జీవించేలా ఏదయినా ఏర్పాటు చేయగలరేమో ఆలోచించండి. వెంటనే కాకపోయినా కాస్త ఆలస్యమయినా ఈ విషయంపై మీరు తప్పక ఆలోచించగలరు.

వీలైతే ఇవ్వాళే ఆదిలక్ష్మి గారితో కింది నెంబర్‌కు కాల్ చేసి మాట్లాడగలరు.
9603419294

వీలైతే ఈరోజు రాత్రిలోపు ఆమె క్షేమ సమాచారం గురించి నా బ్లాగు ద్వారా అందరికీ తెలియపర్చాలని ఉంది. ప్రయత్నిస్తాను.

తప్పకుండా మీరు ఈ విషయంలో సహాయహస్తం అందించగలరని ఆశిస్తూ..
రాజు.
Categories: Middle

ఘరానా ఎత్తిపోతల పధకం

Thu, 12/01/2011 - 11:41




ఘరానా అల్లుడు, ఘరానా దొంగ వగైరా విన్నాం కాని ఈ ఎత్తిపోతల పథకం ఏంటి అనుకుంటున్నారా??? ఇదేమి ప్రభుత్వ పధకం కాదు. బ్లాగుల నుండి జరుగుతున్న ఎత్తిపోతల కార్యక్రమం. ఇది ఎంతమంది గమనించారో ఏమో మరి.. వారం క్రింద నా షడ్రుచులు బ్లాగు కోసం ఎదో వివరాలు కావాలని నెట్ లో సెర్చింగ్ చేస్తుంటే తెలిసింది ఈ సంగతి. నేను ఏడాది క్రింద వినాయక చవితికి రాసిన తాలికల పాయసం వంటకం వివరాలు, ఫోటో తో సహా ఒక ప్రముఖ దినపత్రిక వాళ్ళు తమదిగా వేసుకున్నారు. ఇవ్వడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవనుకుంటే కనీసం ముందస్తుగా నన్ను అడిగింది లేదు. పేపర్లో నా పేరు కాని బ్లాగు లింకు కాని ఇవ్వలేదు. ఇదేంటి అని అడిగితే వారం రోజులైనా సమాధానం లేదు. ఇలాంటి వాళ్ళను ఏం చేయాలంటారు. ఇంకా వెతికితే ఎవరెవరు ఏమేమి ఎత్తుకెల్లారో తెలుస్తుంది. నెట్ లో సైట్లు అంటే వాళ్ళు ఆదాయం ఉండదు లేదా తక్కువేమో అనుకోవచ్చు. ప్రింట్ పత్రికల్లో కూడా ఇదే పనా.. మరి మనం కూడా పత్రికల్లో వచ్చిన వ్యాసాలు ఎత్తుకొచ్చి పెట్టుకుంటే ఏం కాదేమో.. నా వంటలనే కాదు. మరి కొంతమంది తెలుగు బ్లాగులనుండి కంటెంట్ తీసుకున్నారని తెలిసింది.. పత్రికలవాళ్ళ దగ్గర మంచి కంటెంట్ ఇవ్వగలిగే వాళ్ళు లేరా, డబ్బులు లేవా. అడిగి తీసుకోవాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదా.. నెట్ లో ఉన్నాయి కదా అని ఎత్తుకెళ్ళడమేనా .. బ్లాగులలో కూడా మంచి సమాచారం ఉంటుంది. నచ్చితే అడిగి తీసుకుని డబ్బులివ్వడానికి ఏం రోగమంట వాళ్ళకు.. కనీసం పేరు, బ్లాగు లింక్ కూడా ఇవ్వరు. నెట్లో మరో ప్రముఖ వెబ్ సైటే కూడా దర్జాగా నా వంటలు ఫొటోలతో సహా ఎత్తేసారు. నాకు తెలీదు. నా వంటల బ్లాగు ఫాలో అయ్యేవారు లింక్ తో సహా ఇచ్చారు. అడిగితే అది తీసేశారు. మర్చిపోయారనుకుని మళ్ళీ పెట్టుకున్నారు అతి తెలివిగా ఫోటో కొద్దిగా మార్చి. నేను తీసిన ఫోటో నేను గుర్తుపట్టలేనా??

ఇవి చూడండి. తీరిగ్గా కూర్చుని వెతికితే ఇంకెన్ని బయటపడతాయో..
నకలు...

అసలు ...




వీళ్ళను ఏమీ చేయలేమా.. రైట్ క్లిక్ డిసేబుల్ చేసినా ఏదోలాగా కాపీ చేసుకుంటారు కదా. నేనైతే ఈ సూర్య పత్రిక ఎడిటర్ కి ఐదు రోజుల క్రింద మెయిల్ పెట్టా. ఇంతవరకు సమాధానం లేదు. లీగల్ గా నోటీస్ ఇవ్వడానికి అన్నీ సిద్ధం చేశా.. ఊరుకుంటుంటే తేరగా నెట్ లో ఉన్నాయని అన్ని పత్రికలవాళ్ళు ఎత్తుకెళతారు.. .. బ్లాగులంటే ఏంటో అనుకుంటున్నారు.

మీరు కూడా ఇలాంటి ఎత్తిపోతల పథకం అవలంభించే వాళ్ళను చూసారా. వివరాలు చెప్తే వాళ్ళ సంగతి చూడొచ్చు.
Categories: Middle

‘ఆరోజుల‘పై మహిళల్లో చైతన్యం

Tue, 11/29/2011 - 20:55


'ఆరోజుల'పై మహిళల్లో చైతన్యం..

భారతదేశం కర్మభూమి. 200 ఏళ్లు విదేశీయుల దాస్యంలో ఉండి ఎన్నో ఏళ్లు పోరాడి స్వాతంత్య్రం తెచ్చుకున్నాం. క్రమక్రమంగా ఈనాడు భారతదేశం ఎంతో అభివృద్ధి సాధించింది సామాజికంగా, వాణిజ్యపరంగా, ఆర్థికపరంగానూ కూడా. ఒకవైపు అంబరాలను అందుకుంటున్న సాంకేతిక విజయాలు, మరోవైపు కనీసం తిండి, బట్టకు కూడా నోచుకోని దుర్భర జీవనం. పట్నాలలోని మురికివాడలు, మారుమూల పల్లెల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ దారిద్య్రంతోపాటు నీటి ఎద్దడి, అపరిశుభ్రతవల్ల ఎందరో మహిళలు తమకు నెల నెలా తప్పనిసరిగా అవసరమయ్యే బట్టముక్క కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.


మన భారతీయ సంస్కృతిలో స్ర్తి తన జీవితంలో 30-35 సంవత్సరాలలో ఎదుర్కొనే నెలసరి గురించి బహిరంగంగా మాట్లాడ్డం చాలా తప్పు, పాపం కూడా. అది ఒక నిషేధిత అంశం అని చెప్పవచ్చు. మనిషికి కావలసింది కూడు, గూడు, నీడ అని అందరూ అంటారు. ఎన్నో సంస్థలు వాటి గురించి ప్రచారం చేస్తాయి, సహాయం చేస్తాయి కాని మహిళలకు క్రమం తప్పకుండా అవసరమైన శుభ్రమైన బట్ట గురించి ఎవ్వరూ ఆలోచన కూడా చేయరు. అసలు కట్టుకోవడానికే గుడ్డలు లేవంటే ఇక దీని గురించి ఎవరు పట్టించుకుంటారు. అది అంత ముఖ్యమా? ఆడాళ్లు వాళ్ల తిప్పలేవో వాళ్లు పడతారు అని వదిలేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరూ తప్పనిసరిగా అనుభవించే ప్రాకృతిక ధర్మం ఇది. దీని గురించి మాట్లాడటానికి నిరక్షరాస్యులైన గ్రామీణ మహిళలే కాదు చదువుకున్న పట్నంలోని స్ర్తిలు కూడా సిగ్గుపడతారు, ఇష్టపడరు. అసలు ఈ విషయం గురించి గట్టిగా అందరిలో మాట్లాడ్డం కూడా తప్పు అనేవారున్నారు. ముఖ్యంగా మగవారిముందు అస్సలు నోరు విప్పరు.


ఆకాశంలో సగం అని చెప్పుకునే మహిళలు ప్రపంచ జనాభాలో కూడా దాదాపు సగం ఉన్నారు. వ్యాపార ప్రకటనల్లో కూడా మహిళలే లక్ష్యంగా ఉన్నారు. కాని వారికి అవసరమైన సానిటరీ నాప్కిన్స్ గురించి ఆలోచించేది ఎంతమంది. ఇప్పుడిప్పుడు వీటి గురించి ప్రకటనలు విరివిగా వస్తున్నాయి. కాని అవి అందరికీ అందుబాటైన ధరలో ఉండవు. పట్టణాల సంగతి వదిలేస్తే గ్రామాల్లోకి వెళితే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చాలామంది స్ర్తిలు, పురుషులు ఈ నెలసరి రక్తస్రావం అనేది ఒక పాపం, అపరిశుభ్రం, అంటరానితనంగా భావిస్తారు. ఈ సమయంలో నాలుగు రోజులు ఇంట్లోకి రాకుండా ఎవరినీ ముట్టుకోకుండా విడిగా ఉండే స్ర్తిలు ఇంకా ఉన్నారు. తమ అవసరానికి వారు అపరిశుభ్రమైన పాత బట్టలు ఉపయోగిస్తారు. అలా చేయటంవల్ల తెలియని వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ కలుగుతాయి అని వారికి తెలీదు. ఆ బట్టలను రోజూ ఉతుక్కుంటారు కాని వాటిని బహిరంగంగా ఆరవేయలేరు. కొన్నిచోట్ల ఉతుక్కోవడం కూడా కష్టమే. ప్రతీ ఇంటికి బావి, కుళాయి ఉండదు. వీధిలో ఉండే చేతి పంపులే వారికి దిక్కు. స్నానానికి నీళ్లు కరవైతే ఇక ఈ బట్టలుతకడానికి నీళ్లెక్కడినుండి తేగలరు? ఇక చాటు అనేది చాలా కష్టం. అందుకనే ఇంట్లో ఎవరికీ కనపడకుండా తలుపు వెనకాలో, గోడ పక్కనో ఆరేసుకుంటారు. అవి పూర్తిగా ఎండవు. తడితడిగా ఉంటాయి. అయినా వాటినే ఉపయోగించక తప్పని పరిస్థితులు. ఒకోసారి కొన్ని ఇళ్ళల్లో ఉండే ఇద్దరు ముగ్గురు స్ర్తిలు ఒకేబట్టను వాడుకుంటారు. ఇంకో దారుణమైన విషయమేమిటంటే కొందరు స్ర్తిలు ఒకే బట్టను సంవత్సరం పైగా ఉపయోగిస్తారు. అది గట్టిగా రాయిలా మారినా అదే దిక్కు. వారికి తప్పదు మరి. దారిద్య్రం మూలంగా వేరే బట్టలు లభించడానికి ఆస్కారం లేదు.


ఇంకా కొన్ని గ్రామాలలో మహిళలు బియ్యం సంచీ ముక్కలు, జనపనార గుడ్డలు, కాగితం, బియ్యం ఊక కూడా ఉపయోగించుకుంటారు. ఇలా చేయడంవల్ల వ్యాధులు సోకి ఆరోగ్యం చెడిపోయి గర్భసంచి కోల్పోయినవారు, ఒకోసారి ప్రాణాలు పోగొట్టుకున్నవారు ఉన్నారు. అంతేకాదు మారుమూల గ్రామాలలో ఇప్పటికీ మరుగుదొడ్ల సమస్య కూడా ఉంది. ప్రతీ మనిషికి ఉదయం లేవగానే తీర్చుకోవాల్సిన కాలకృత్యాలు ఉన్నాయి. కాని స్ర్తిలకు ఉదయం వెలుగులో కాకుండా ఊరంతా సద్దుమణిగాక రాత్రివేళలో ఊరవతల తుప్పల్లో, పొదల్లో తమ కాలకృత్యాలు తీర్చుకోవాల్సివస్తుంది. అప్పుడప్పుడు ఆ చీకటిలో విషపురుగులు, పాములబారిన పడక తప్పదు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇక అపరిశుభ్రత, ఆరోగ్యం గురించి ఎవరు ఆలోచిస్తారు.


కాని 2004 నుండి ఒక స్వచ్ఛందసంస్థ ‘గూంజ్’ ఈ విషయమై దేశంలోని గ్రామాలు, పట్టణాలలో పర్యటించి మహిళలను కలుసుకుని వారి అవసరాలు, సమస్యల గురించి తెలుసుకుని తమకు సాధ్యమైన సాయం చేస్తున్నారు. తమ సంస్థద్వారా నూలు బట్టలు సేకరించి వాటిని శుభ్రంగా ఉతికి సానిటరీ ప్యాడ్‌లుగా తయారుచేసి సరఫరా చేస్తున్నారు. వీరు నెలకు కనీసం 1,50,000 నుండి 2,00,000 వరకు తయారుచేస్తున్నారు. ఈ పర్యటనలో ఎంతోమంది మహిళలు ఒక పరిశుభ్రమైన బట్టకోసం వారు పడే తిప్పలు, ఈ విషయంలో సరియైన అవగాహన లేక అనారోగ్యం పాలవడం గురించి తెలుసుకుని నిర్ఘాంతపోయారు. సంస్థసభ్యులు ఊరూరా తిరిగి ఈ సానిటరీప్యాడ్స్ ఉపయోగం గురించి, వాటి తయారీ గురించి, ఆరోగ్య సమస్యలగురించి మహిళలకు వివరిస్తున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి పునాది వేసిన సంస్థ వ్యవస్థాపకుడు అంశు గుప్తా అంటారు... మహిళలకు ఒక శుభ్రమైన బట్ట అందుబాటులో వారు ఆమె నెలసరి ఒక బాధగా, పాపంగా కాకుండా తమకు మాత్రమే లభించిన ప్రత్యేకమైన ప్రాకృతిక ధర్మంగా భావిస్తారు. తమ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. ఈ సంస్థ వారు పట్టణాలనుండి బట్టలు, స్టేషనరీ గినె్నలు వగైరా వస్తువులను సేకరించి వాటిని గ్రామీణులకు ఉపయుక్తంగా మార్చి పంపిణీ చేస్తున్నారు. ఈనాడు గూంజ్ సంస్థ దేశంలో 21 రాష్ట్రాలలోని గ్రామాల ప్రజలకు 70 టన్నుల వస్తువులను సరఫరా చేస్తుంది. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను పొందింది. అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలలో తరచు వరదలు, ప్రకృతి బీభత్సాలు సంభవిస్తుంటాయి. ఇటువంటి సమయంలో బాధితులకు కనీస అవసర వస్తువులను అందరూ అందిస్తారు. కాని స్ర్తిలకు అవసరమైన బట్టను గురించి ఎవరూ ఆలోచించరు. ఛీ అనుకుంటారు కూడా. ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఎటువంటి చొరవ చూపడంలేదు అంటారు అంశుగుప్తా. ఇటీవల భారత ప్రభుత్వం సానిటరీ నాప్కిన్స్ సబ్సిడీ ధరలకు అందిస్తామని ప్రకటించింది. కాని అది ఎంతవరకు అమలవుతుందో తెలీదు. ఈ సంస్థకు సహాయం చేయదలచినవారు ఈ సైట్లో తగిన వివరాలు పరిశీలించగలరు..http://goonj.org/
Categories: Middle

ఘరానా ఎత్తిపోతల పథకం...

Tue, 11/29/2011 - 07:41




ఘరానా అల్లుడు, ఘరానా దొంగ వగైరా విన్నాం కాని ఈ ఎత్తిపోతల పథకం ఏంటి అనుకుంటున్నారా??? ఇదేమి ప్రభుత్వ పధకం కాదు. బ్లాగుల నుండి జరుగుతున్న ఎత్తిపోతల కార్యక్రమం. ఇది ఎంతమంది గమనించారో ఏమో మరి.. వారం క్రింద నా షడ్రుచులు బ్లాగు కోసం ఎదో వివరాలు కావాలని నెట్ లో సెర్చింగ్ చేస్తుంటే తెలిసింది ఈ సంగతి. నేను ఏడాది క్రింద వినాయక చవితికి రాసిన తాలికల పాయసం వంటకం వివరాలు, ఫోటో తో సహా ఒక ప్రముఖ దినపత్రిక వాళ్ళు తమదిగా వేసుకున్నారు. ఇవ్వడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవనుకుంటే కనీసం ముందస్తుగా నన్ను అడిగింది లేదు. పేపర్లో నా పేరు కాని బ్లాగు లింకు కాని ఇవ్వలేదు. ఇదేంటి అని అడిగితే వారం రోజులైనా సమాధానం లేదు. ఇలాంటి వాళ్ళను ఏం చేయాలంటారు. ఇంకా వెతికితే ఎవరెవరు ఏమేమి ఎత్తుకెల్లారో తెలుస్తుంది. నెట్ లో సైట్లు అంటే వాళ్ళు ఆదాయం ఉండదు లేదా తక్కువేమో అనుకోవచ్చు. ప్రింట్ పత్రికల్లో కూడా ఇదే పనా.. మరి మనం కూడా పత్రికల్లో వచ్చిన వ్యాసాలు ఎత్తుకొచ్చి పెట్టుకుంటే ఏం కాదేమో.. నా వంటలనే కాదు. మరి కొంతమంది తెలుగు బ్లాగులనుండి కంటెంట్ తీసుకున్నారని తెలిసింది.. పత్రికలవాళ్ళ దగ్గర మంచి కంటెంట్ ఇవ్వగలిగే వాళ్ళు లేరా, డబ్బులు లేవా. అడిగి తీసుకోవాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదా.. నెట్ లో ఉన్నాయి కదా అని ఎత్తుకెళ్ళడమేనా .. బ్లాగులలో కూడా మంచి సమాచారం ఉంటుంది. నచ్చితే అడిగి తీసుకుని డబ్బులివ్వడానికి ఏం రోగమంట వాళ్ళకు.. కనీసం పేరు, బ్లాగు లింక్ కూడా ఇవ్వరు. నెట్లో మరో ప్రముఖ వెబ్ సైటే కూడా దర్జాగా నా వంటలు ఫొటోలతో సహా ఎత్తేసారు. నాకు తెలీదు. నా వంటల బ్లాగు ఫాలో అయ్యేవారు లింక్ తో సహా ఇచ్చారు. అడిగితే అది తీసేశారు. మర్చిపోయారనుకుని మళ్ళీ పెట్టుకున్నారు అతి తెలివిగా ఫోటో కొద్దిగా మార్చి. నేను తీసిన ఫోటో నేను గుర్తుపట్టలేనా??

ఇవి చూడండి. తీరిగ్గా కూర్చుని వెతికితే ఇంకెన్ని బయటపడతాయో..
నకలు...

అసలు ...




వీళ్ళను ఏమీ చేయలేమా.. రైట్ క్లిక్ చేసినా కాపీ చేసుకుంటారు కదా. నేనైతే ఈ సూర్య పత్రిక ఎడిటర్ కి ఐదు రోజుల క్రింద మెయిల్ పెట్టా. ఇంతవరకు సమాధానం లేదు. లీగల్ గా నోటీస్ ఇవ్వడానికి అన్నీ సిద్ధం చేశా.. ఊరుకుంటుంటే తేరగా నెట్ లో ఉన్నాయని అన్ని పత్రికలవాళ్ళు ఎత్తుకెళతారు.. .. బ్లాగులంటే ఏంటో అనుకుంటున్నారు.

మీరు కూడా ఇలాంటి ఎత్తిపోతల పథకం అవలంభించే వాళ్ళను చూసారా. వివరాలు చెప్తే వాళ్ళ సంగతి చూడొచ్చు.
Categories: Middle

కథ చెబుతారా??

Wed, 11/23/2011 - 04:00

మీకు కథలు చదవడం అలవాటే కదా. మరి ఎపుడైనా కథలు చెప్పారా?? చెప్పే ఉంటారు. ఆఫీసుకు ఆలస్యంగా వెళ్ళినా. ఇంటికి ఆలస్యంగా వచ్చినా. చెప్పిన పని టైం కి చేయకపోయినా అప్పటికపుడు కొత్త కథ క్రియేట్ చేసేసి చెప్పేస్తుంటారు. అప్పటికి ఆ గండం తీరిపోతుంది. అవతలి వాడు నమ్మేంతవరకు మన కథలు పని చేస్తాయి. లేదా నమ్మేట్టు చెప్పడం, నిజమని అనిపించేలా చెప్పడం అనేది మన టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. కొందరు కథలు యిట్టె చెప్పేస్తారు. కొందరు ఎంత ప్రయత్నించినా చెప్పలేరు. అమాయకులు నిజం చెప్పేసి మాటలు పడతారన్నమాట. :) ఇక అసలు విషయానికి వస్తే.. మీకు ఒక సన్నివేశం చెప్తే దాని ఆధారంతో ఒక చిన్న లేదా పెద్ద కథ రాయగలరా.. నవల రాస్తా అంటారా.. మరీ మంచిది.. మీ ఇష్టం.

పొద్దు జాలపత్రికవాళ్ళు ఈ మధ్య కథ చెప్తారా అంటున్నారు. ఓస్ అదెంత పని . వాళ్ళు ఇచ్చిన సన్నివేశాన్ని జాగ్రత్తగా చదవండి. ఆలోచించండి. చించండి.. రాసేయండి. రాస్తూ పోతూ ఉంటే అది చిన్న కథ లేదా పెద్ద కథ ఏదైనా పర్లేదు. రాయడం అయ్యాక పొద్దు వాళ్ళకు పంపేయండి.. ఓ పనైపోతుంది.. మరిన్ని వివరాలకు ఇది చూడండి.. కథ చెబుతారా.. వాళ్లకు నచ్చితే పొద్దులో అచ్చేస్తారు. లేదంటే మీ బ్లాగులో పడేయండి. ఇలా తరచూ రాస్తుంటే మీకే బాగా రాయడం అలవాటవుతుంది. ఊరికే ఎదో ఒక విషయం మీద టపా రాయడం కన్నా ఇలా కొత్తగా కథలు రాయడం ఎలా అనేది తెలుస్తుంది.. అలవాటవుతుంది. అదన్నమాట సంగతి.. రాయండి రాసేవాళ్ళకు చెప్పండి.
Categories: Middle

కార్తీక వనభోజనాలు - ఎవరెవరు చేసారంటే

Fri, 11/18/2011 - 09:02
కార్తీక పున్నమి సందర్భంగా రెండేళ్ళ నుండి తెలుగు బ్లాగుల్లో కూడా వనభోజనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తమ వంతుగా ఎదో ఒక వంటకం తమ బ్లాగులో పెట్టేసి అందరిని పిలిచేస్తున్నారు. ఈసారి కూడా పున్నమి నాడు వనభోజనాలు తక్కువమంది పాల్గొన్న సూపర్ హిట్ అని చెప్పవచ్చు. మరి ఆ రోజు ఎవరెవరు పాల్గొన్నారో చూసి అందరినీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. అన్ని వంటకాలు ఒకేదగ్గర ఉంటే ఎప్పుడైనా కొత్త వంటకం చేయాలనుకున్నప్పుడు ఇక్కడ చూసుకుంటే సరి.. వనభోజనాల పిలుపును అందుకొని నడుం బిగించి వంటలు చేసేసి, రాసేసిన వారందరికీ బోల్డు బోల్డు థాంక్స్..

మౌళి
కృష్ణప్రియ
మాలకుమార్
శ్రీలలిత
లత
ఎన్నెల
పద్మార్పిత
జ్యోతిర్మయి
వరూధిని
జ్యోతి
జయ
Categories: Middle

హలో బ్లాగున్నారా??

Fri, 11/11/2011 - 20:19
ఆంధ్రభూమి దినపత్రిక వైజాగ్ ఎడిషన్లో ప్రతీ ఆదివారం హలో బ్లాగున్నారా ? అన్న శీర్షికను నిర్వహిస్తున్నారు జగతి జగద్ధాత్రి. ఈ శీర్షికలో గత జులైలో నా బ్లాగు కూడా చోటు చేసుకుంది. ఆ పేపర్ దొరకడానికి ఇన్ని రోజులు పట్టింది



నా గురించి ఇంత ఆత్మీయంగా రాసిన మాటలను నా బ్లాగులో నిక్షిప్త పరుచుకోవాలని ఈ కటింగ్స్ ఇక్కడ పెడుతున్నాను..




థాంక్ యూ జగతి.. లవ్ యూ..
Categories: Middle

కార్తీక వనభోజనాలు -బొంబాయ్ హల్వా

Thu, 11/10/2011 - 04:05


ముంధుగా అందరికి కార్తీక పూర్ణిమ శుభాకాంక్షలు. మరి ఈ రోజు బ్లాగ్ వనభోజనాలు అనుకున్నాం కదా. అఫ్పుడే హడావిడి మొదలైంది. నావంతుగా స్వీటు తెచ్చాను. అందునా నాకు చాలా చాలా ఇష్టమైంది..

స్వీట్లంటే నాకు మొదటినుండి ఇష్టమే కాని డబ్బా ఖాళీ చేసేంత ఇష్టం కాదులెండి. కాని అన్నింటికంటే చాలా చాలా ఇష్టమైంది రబ్బర్‌లా సాగే రంగు రంగుల బొంబాయి హల్వా, గట్టిగా రాయిలా ఉండే సోన్‌పట్టీ. ముఖ్యంగా పుల్లారెడ్డి, బొంబాయ్ హల్వా షాపులోవే బాగుంటాయి. ఇంక వేరేవ్వరూ అలా చేయలేరు కూడా. ఇప్పుడు బొంబే హల్వా దుకాణం ఎత్తేసారు. మిగిలింది పుల్లారెడ్డి.. చిన్నప్పటినుండి ఎవరు స్వీట్ డబ్బా తెచ్చినా అందరికంటే ముండు ఈ రెండు స్వీట్లు కనిపిస్తే ఎత్తేసేదాన్ని. వీటికోసం మా మరదలు. నా కొడుకు నాతో పోటీకొస్తారు... అందుకే ఈ స్వీట్లను జాగ్రత్తగా డబ్బాలో పెట్టి నా అల్మైరాలో దాచుకుంటాను. ఎప్పుడైనా తీరికగా ఉన్నప్పుడు ఓ పుస్తకం పట్టుకుని ఓ స్వీటు ముక్క కొంచం కొంచం తింటూ చదువుకోవడం చాలా ఇష్టమైన అలవాటు. అదేంటో ఇప్పుడు ఎవరూ స్వీట్ డబ్బాలు తేవట్లేదు. తెచ్చిన కూడా అందులో ఈ హల్వా ఉండదు. ఎంత ఇష్టమైనా ముందులా తినే వయసు కాదు. ప్చ్..

అసలు ఈ స్వీట్ ఇంట్లో కూడా చేయొచ్చు అనే విషయం అస్సలు తెలీదు. అది స్వీట్ షాపువాళ్లే చేయగలరు, మనం ఇంట్లో చేయలేం అనుకునేదాన్ని. లేకుంటే ఎప్పుడో చేసుకుని తినేదాన్ని కదా. ఈ మధ్యే ఒక ఇంగ్లీషు ఫుడ్ బ్లాగులో ఈ హల్వా చేసుకోవచ్చు అని తెలిసింది. అది కూడా చాలా ఈజీగా. మరి నేను ఊరుకుంటానా?? చేసి తినేసా. అందరికీ చెప్పుకున్నా బొంబాయ్ హల్వా చేసానోచ్ అని. మరి మావాళ్లు అందరికీ తెలుసు అదంటే నాకెంత ఇష్టమో?? కాని తెలిసినా అప్పుడప్పుడు తెచ్చివ్వాలని మాత్రం ఒక్కరూ అనుకోలేదు ఇంతవరకు..

ఇక ఈ హల్వా ఎలా చేయాలో చెప్పనా...

కార్న్ ఫ్లోర్ - 5 tbsp
పంచదార - 1 1/2 కప్పులు
నీళ్లు - 3 1/2 కప్పులు
గుమ్మడికాయ గింజలు లేదా కాజు, బాదాం, పిస్తా ముక్కలు - 1/4 కప్పు
నెయ్యి - 2 tbsp
ఇలాచి పొడి - 1/2 tsp
ఓరెంజ్ లేదా గ్రీన్ కలర్ - 3 - 4 చుక్కలు

మూడు కప్పుల నీళ్లు మరిగించి చక్కెర వేసి చిక్కబడి తీగపాకం వచ్చేవరకు మరిగించాలి. మరో పక్క ఒక ప్లేటుకు లోపలంతా నెయ్యి రాసి ఉంచుకోవాలి. మిగిలిన సగం కప్పు నీళ్లలో కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి . ఈ మిశ్రమాన్ని మరుగుతున్న చక్కెరపాకంలో వేసి ఉడికించాలి. ఇప్పుడు ఇది పాలల్లా తెల్లగా ఉంటుంది . క్రమేణా రంగు మారి పారదర్శకంగా గ్లాసులా అవుతుంది. ఇప్పుడు ఇలాచి పొడి, నెయ్యి, కలర్, చిన్న ముక్కలు చేసిన డ్రై్‌ఫ్రూట్స్ లేదా గుమ్మడి గింజలు వేసి కలపాలి. వెంటనే దింపేసి నెయ్యి రాసిన పళ్లెంలో వేసి సమానంగా పరవాలి. గంట సేపు అలా వదిలేసి ముక్కలు కట్ చేసుకుంటే సరి.. ఈ స్వీటు చేసేటప్పుడు నిదానంగా చిన్న మంటపై చేయండి. వీలుంటే నాన్ స్టిక్ ప్యాన్ ఉపయోగించండి. లేకుండే మాడుతుంది.

ఇది చదివాక కూడా అర్ధం కాలేదంటే. ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియో చూసేయండి.


Categories: Middle

కార్తీక వనభోజనాలకు ఆహ్వానం

Tue, 11/08/2011 - 06:04

కార్తీకమాసం వచ్చేసింది. ఈ సంవత్సరానికి పెద్ద పండుగలన్నీ ఐపోవచ్చాయి. చలిపులి మెల్లిగా ఒళ్లువిరుచుకుంటుంది. కార్తీకమాసం శివకేశవులిద్దరికి ప్రియమైనది.నదీ స్నానాలు, ఉపవాసాలు, దీపారాధన,పూజలతో అందరూ బిజిబిజిగా ఉన్నారు. ఈ మాసంలో మరో ముఖ్యమైనది కార్తీక వనభోజనాలు. తమ వృత్తి, ప్రవృత్తులతో ఎవరికి వారు బిజీ ఐపోతున్నారు. ఒకరినొకరు కలవడానికి వీల్లేకుండా మనుషులమా? యంత్రాలమా అన్నట్టు అయ్యారు అందరూ. ఏమంటే తీరికలేదు అంటారు. ఈ వనభోజనాల నెపంతో ఇంటినుండి, ఉద్యోగబాధ్యతనుండి ఒక్కరోజైనా దూరంగా బంధువులతో, స్నేహితులతో గడిపేస్తారు. మరి మన బ్లాగుల్లో రెంఢు సంవత్సరాలనుండి ఈ కార్తీక వనభోజనాల ఒరవడి మొదలైంది తెలుసు కదా... దేశవిదేశాల్లో ఉన్నవారందరూ ఎంతో ఉత్సాహంగా ఇందులో పాల్గొంటున్నారు. మరి ఈసారి మాత్రం వదిలేస్తామా? ఎల్లుండే కార్తీక పూర్ణిమ. అందరూ రెడీనా.. మీకు నచ్చిన, వచ్చిన వంటలతో వచ్చేయండి ఎల్లుండి గురువారం 10వ తేదీన బ్లాగ్ వనభోజనాలు.. బ్లాగులు, సంకలినులన్నీ ఘుమఘుమలాడిపోవాలి....

గమనిక : ఇది ఆడవారికే కాదు. నలభీముల వారసులైన మగమహారాజులకు కూడా..

గతంలో మనం జరుపుకున్న వనభోజనాల విశేషాలు:

2009

2010
Categories: Middle

పుత్తడి లాంటి ఇత్తడి!

Sun, 11/06/2011 - 22:12




పుత్తడి లాంటి ఇత్తడి

అనాదిగా కాంతలకూ కనకానికీ అవినాభావ సంబంధముంది. బంగారం అంటే ఇష్టపడని అతివలు ఉండరేమో. అందానికే కాకుండా బంగారం మన భారతీయ సంప్రదాయానికీ, ఆచారాలకూ ప్రతీకగా నిలుస్తుంది. ఇంట్లో ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తొచ్చేది బంగారమే. ఇక ఆడపిల్లలకు పుట్టినప్పటి నుండే బంగారం కొనడం ప్రారంభిస్తారు. పెరుగుతున్న కొద్దీ ఎన్నో రకాలైన ఆభరణాలు తయారుచేయిస్తారు. బంగారం అందానికే కాకుండా అవసరానికి కూడా ఆదుకుంటుందని అందరికీ తెలిసిందే. అందుకే చేతిలో కాస్త డబ్బున్నప్పుడల్లా బంగారాన్ని ఒక ఆస్థిగా కొని పెడుతుంటారు. ఒకప్పుడు విరివిగా కొనే బంగారం నేడు అందనంత ఎత్తుకు ఎగిరిపోతోంది. ఈ రోజు మధ్యతరగతి వారికి బంగారం కొనడానికి అందుబాటులో లేదనే చెప్పవచ్చు. అలా అని నగలు లేకుండా ఉంటారా ఆడవాళ్లు. ఉండగలరా? ఇలాటి వారి కోసమే మార్కెట్లోకి బంగారపు నగలకు ధీటుగా ఏ మాత్రం తీసిపోని రోల్డ్‌గోల్డ్, వన్ గ్రామ్ గోల్డ్ నగలు విరివిగా లభిస్తున్నాయి. అవి కూడా అందరికీ అందుబాటైన ధరలో ఆకర్షణీయమైన డిజైన్లలో మగువలను ఆకట్టుకుంటున్నాయి.



పాపిట బిళ్ల నుండి కాలి పట్టీల వరకు వన్ గ్రామ్ నగలు లెక్కలేనన్ని డిజైన్లలో లభిస్తున్నాయి. ఒకప్పుడు మహిళలు బంగారం నగలు మాత్రమే ధరించేవారు. గిల్టు నగలు అంటే చాలా చిన్నచూపు ఉండేది. అవసరమా అనుకునేవారు. ఎంత తక్కువలో ఐనా మెడలో ఒక సన్న చైను, చేతులకు రెండు గాజులు, చెవులకు చిన్న దిద్దులు ఉంటే చాలు అమ్మాయికి. రోజూ వేసుకుంటుంది అనేవాళ్లు. కాని ఈ రోజు బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నా ఈ వన్‌గ్రాం గోల్డ్ నగలు మాత్రం రోజుకో డిజైన్‌వి వేసుకునేలా విరివిగా, అందుబాటైన ధరల్లో దొరుకుతున్నాయి. ఏదైనా పార్టీకి కాని పెళ్లికి కాని వెళ్లినప్పుడు అక్కడ మహిళలు ఒంటినిండా నగలతో కనిపిస్తే ఆశ్చర్యపోకండి. అందులో సగానికి పైగా ఈ వన్‌గ్రామ్ నగలే అయ్యుండవచ్చు. ఈ నగలు మధ్యతరగతి వారేకాక సంపన్న వర్గాల వారు కూడా నిస్సంకోచంగా ధరిస్తున్నారు. బంగారం కంటే ఈ నగలలోనే ఎక్కువ డిజైన్లు ఉన్నాయేమో అని ఆశ్చర్యపోక తప్పదు. అస్సలు తేడా కనిపెట్టలేము కూడా. వీసమెత్తు బంగారం లేకున్నా ఈ వన్‌గ్రామ్ నగలు వేసుకుని దర్జాగా తిరుగుతున్నారు స్ర్తిలు. వీరి అవసరానికి తగ్గట్టుగానే ఈ నగలమ్మే దుకాణాలు కోకొల్లలుగా ఉన్నాయి. పెళ్లికి కావలసిన దుస్తులు, ఇతర వస్తువులలాగే ఈ నగలను కూడా తమకు నచ్చినట్టుగా డిజైన్ చేయించుకునే అవకాశం కూడా ఉంది.



ఈ మధ్యే ప్రాచుర్యం పొందిన ఈ వన్‌గ్రామ్ గోల్డ్ నగలు హిందీ టీవీ సీరియళ్ల ద్వారా ఉత్తరాది నుండి మనకు పరిచయమయ్యాయి. ఇందులో ఉత్తరాది డిజైనే్ల కాక టెంపుల్ జ్యుయెలరీ, దక్షిణాది సంప్రదాయ డిజైన్లు కూడా ఉన్నాయి. ఒక్కోసారి ఏది బంగారం నగో, ఏది వన్‌గ్రామ్ నగో తెలీనంతగా ఉంటున్నాయి. అది ఆ ఆభరణం తయారుచేయడంలోని నైపుణ్యమే అని ఒప్పుకోవాల్సిందే. వన్‌గ్రామ్ నగలు రూ.200 నుండి రూ.10 వేల వరకు ధర పలుకుతున్నాయి. అందులో వాడిన రాళ్లు, ముత్యాలు, పగడాలను బట్టి ధర పలుకుతుంది. ఈ నగలను రాగి లేదా వెండితో తయారుచేసే ఒక గ్రాం బంగారు పూత పూస్తారు. ఈ పూత 0.000007 అంగుళాల కన్నా తక్కువ పల్చగా ఉంటుంది. అందుకే నాణ్యతగా మన్నికగా ఉంటాయి.



ఈ మధ్య మీరు హిందీ, తెలుగు సినిమాల్లో గమనించే ఉంటారు. ముఖ్యంగా జోదా అక్బర్, అరుంధతి, నాగవల్లి మొదలైన సినిమాల్లో నటీమణులు చాలా భారీ నగలు ధరించి ఉంటారు. ఒక్కో నగ లక్షల్లో ఉంటుందని అనుకుంటాం. అంత అందమైన డిజైన్ల నగలు మనం కూడా కొనుక్కోవచ్చు అనే ఊహ చేయడానికి భయం వేస్తుంది. కాని అదే డిజైన్ నగలు వన్‌గ్రామ్ గోల్డ్‌లో చాలా తక్కువ అందుబాటైన ధరలో మార్కెట్లో లభిస్తుంది. ఉదా.రాళ్లు పొదిగిన బంగారు జడ రెండు నుండి నాలుగు లక్షలు ఉంటే వన్‌గ్రామ్‌లో రెండు వందల నుండి మూడు వేలల్లో దొరుకుతుంది. వడ్డాణాలు బంగారంతో చేసినవి రాళ్లు పొదిగిన లక్ష్మీదేవి బొమ్మ ఉన్నవి 3 లక్షల నుండి 6 లక్షల్లో ఉంటే వన్‌గ్రామ్ గోల్డ్‌లో అదై డిజైన్‌లో 400 వందల నుండి 1500 రూపాయల్లో లభిస్తుంది. ఇంకా పెళ్లికుమార్తె ధరించే ప్రత్యేకమైన నగల సెట్టు రూ.3వేల నుండి రూ.5 వేల వరకు పలుకుతుంది. తాము ధరించిన చీర, డ్రెస్సుకు మ్యాచింగ్ నగలు ధరించాలని దాదాపు ప్రతీ అమ్మాయికి ఉంటుంది. బంగారం ఎలాగూ అందుబాటులో లేదు. కాని ఈ రోజు కొత్త డ్రెస్సు, చీర కొనగానే దానికి తగిన నగలు కూడా కొనడం సర్వసాధారణమై పోయింది అమ్మాయిలకు. ధర కూడా అందుబాటులో ఉండడంతో ఎవరికీ అభ్యంతరం ఉండటం లేదు. ఈ వన్‌గ్రామ్ గోల్డ్ నగలను జాగ్రత్తగా వాడుకుని దాచుకుంటే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. దానికి కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదు మరి. పార్టీ, పెళ్లికి వెళ్లి వచ్చాక వాటిని తీసి జాగ్రత్తగా భద్రపరచాలి. తేమ తగలకుండా చూసుకుంటే అవి మరింత కాలం మీకు అందాన్నిస్తాయి.

-జ్యోతి వలబోజు
Categories: Middle

వనితలా? వినిమయ వస్తువులా?

Tue, 11/01/2011 - 19:26





వనితలా? వినిమయ వస్తువులా?
రాత్రి సమయం. కుటుంబ సభ్యులంతా హాల్లో కూర్చుని టీవీలో వస్తున్న సినిమా చూస్తున్నారు. మధ్యలో ప్రకటనలు మొదలయ్యాయి. కురచ దుస్తులు ధరించిన అమ్మాయిలు షాంపూ గురించి చెప్తున్నారు. తండ్రి, కూతురు, కోడలు, మరిది, మావగారు, పిల్లలు కూర్చుని చూస్తున్న సమయంలో ఇలాంటి ప్రకటనలు ఎంత ఇబ్బందికి గురి చేస్తాయి. ఒక్కోసారి అసహ్యంగా కూడా ఉంటుంది. ఒక వస్తువు అమ్మడానికి ఆడవారిని అర్ధనగ్నంగా చూపడం అవసరమా? అలా చూపిస్తేనే ఆ వస్తువులు అమ్ముడవుతాయా? అసలు ఈ రోజు వివిధ టీవీ ఛానెళ్లలో, పత్రికలలో వచ్చే ప్రకటనలు నిజంగా వినియోగదారుడిని ఆకర్షించి ఆయా వస్తువులను వెంటనే కొనేలా చేస్తున్నాయా? లేక అమ్మాయిల అందాలు ఆరబోస్తున్నాయా? సకుటుంబంగా చూసి మళ్లీమళ్లీ గుర్తుంచుకుని బావున్నాయని మాట్లాడుకునేలా చేసే ప్రకటనలు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చేమో.



ఈనాడు టీవీలేని ఇల్లుండదేమో! అది నిత్యావసరంగా మారి చాలా కాలమైంది. ప్రతీ ఇంట్లో నీళ్లు, కరెంటులా టీవీ, కేబుల్ కనెక్షన్ ఉండాల్సిందే. నెలకు 200 లోపు కడితే చాలు వందల చానెళ్లు చూడొచ్చు. అందులో న్యూస్, వినోదం, విజ్ఞానం, సంగీతం, ఆటలు, సినిమాలు మొదలైన చానల్స్ వందల్లో ఉన్నాయి. లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి సీరియళ్లు, వినోద కార్యక్రమాలు తయారుచేసి సదరు చానెళ్లలో ప్రసారం చేస్తున్నారు. మనకు అంతగా భారమేమీ పడదు. మరి వాళ్లకు నష్టం కాదా అని ఆలోచిస్తే మనం నెలనెలా కట్టే డబ్బు కంటే ఈ చానెళ్లకు ఆదాయాన్నిచ్చేది ఈ ప్రకటనలే. అందుకే వాళ్లు ప్రకటనలలోని అసభ్యతను, అశ్లీలతను గురించి ఎక్కువగా పట్టించుకోరేమో?



భారతదేశంలో స్ర్తిని దేవతగా పూజించే పవిత్ర సంప్రదాయం ఉంది కాని ఈనాడు టీవీలో ప్రసారమవుతున్న 70 శాతం వ్యాపార ప్రకటనలలో మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. ఆ వస్తువులు మగవారు ఉపయోగించేవైనా, ప్రకటనలలో ఆడవాళ్లనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. నిజంగా మహిళలు ఈ ఉత్పత్తులను అమ్మడానికి ఒక వ్యక్తిగా పని చేస్తున్నారా లేక వినియోగదారులను ఆకర్షించడానికి ఆయా వస్తువులతోపాటు ఆ వనితలు కూడా ఒక వ్యాపార వస్తువుగా మారారా? ఇది సీరియస్‌గా ఆలోచించాల్సిన అంశమే.



పెద్దపెద్ద కంపెనీలు తమ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకోవడానికి లక్షలు ఖర్చు పెట్టి ప్రకటనలు తయారుచేస్తాయి. వాటిని చూస్తుంటే ఆ వస్తువు గురించి చెప్తున్నారా లేక అమ్మాయిలను అసభ్యకరంగా చూపిస్తూ జనాలను మాయలో పడేసి మోసం చేస్తున్నారా? ఇక్కడ వినియోగదారులను ఆకర్షించేది సదరు వస్తువా లేక అమ్మాయి అందాల ఆరపోతా? ఈ మధ్య మగవాళ్లు ఉపయోగించే డియొడెరెంట్ ప్రకటన ఎలా ఉంటుంది అంటే అతను ఆ డియోను ఉపయోగించి రోడ్డు పైన వెళుతుంటే అమ్మాయిలంతా వెర్రివాళ్లలా అతన్ని అతుక్కుపోతారు. దీనివల్ల వినియోగదారులకు ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం కాదు. నిజంగా అమ్మాయిలు అలా అతుక్కుపోతారనే పిచ్చి ఆశతో అబ్బాయిలు ఆ కంపెనీ డియోని కొనేస్తారా? దీనివల్ల సదరు కంపెనీ వాళ్లు చెప్పదలచుకున్నదేమిటో అర్థం కాదు. ఆడవాళ్లు అంత బలహీనులా? వాళ్లకంటూ ఒక వ్యక్తిత్వం లేదా? మరీ ఇంత వెర్రిగా ప్రవర్తిస్తారా? అంతే కాదు పురుషులు ఉపయోగించే లోదుస్తులు, షేవింగ్ క్రీం, సూట్ బట్టలు, సిగరెట్లు, తలకు వాడే బిల్‌క్రీమ్, మోటార్ సైకిళ్లకు సంబంధించిన ప్రకటనల్లో కూడా అర్ధనగ్నంగా తయారైన అమ్మాయిలు తప్పనిసరిగా ఉండాల్సిందే.



ఇక్కడ ఆకర్షణీయంగా ప్రదర్శించేది ఆయా వస్తువులతోపాటు అమ్మాయిలను కూడా. అంటే వాళ్లు కూడా ఒక ప్రకటన వస్తువే కదా. ఇలా చూపించినప్పుడే ఆ వస్తువుల అమ్మకాలు పెరుగుతాయి. అలా పెరిగాయి అని కంపెనీ వాళ్లు అన్నప్పుడు ఈ ప్రకటనలు అందమైన అమ్మాయిలను చూపించి మగవాళ్లలోని కాముకత్వాన్ని రెచ్చగొట్టాలనే దురుద్దేశంతో తయారవుతున్నాయి అని చెప్పవచ్చు. ఇలా చేయక తప్పదు అంటున్నారు కంపెనీ వాళ్లు. కాని ఇక్కడ ప్రకటనల్లో ఆకర్షణీయంగా చూపించేది అమ్మాయిలను కాదు వారి అందమైన శరీరాలను తమ ఉత్పత్తులను అమ్మడానికి ఉపయోగపడే వస్తువుగా మార్చేశారు. పురుషులను అందునా యువతను ఆకర్షించడానికి అమ్మాయిల గ్లామర్ అనే మసాలాను కలపక తప్పదంటున్నారు. పైగా పురుషులు ఈ వస్తువులన్నీ ఉపయోగించేది స్ర్తిలను ఆకర్షించడానికి కదా అంటారు.



ఆడవాళ్లు ఉపయోగించే ప్రకటనలు మరీ అర్థం పర్థం లేకుండా ఉంటున్నాయి. ఉదా.అమ్మాయిలు ఉపయోగించే క్రీం వల్ల వారంలో చర్మం రంగు మారి మరింత కాంతివంతంగా మారుతుందట. అలా మారితే మళ్లీ ఇంకో క్రీం అవసరం ఉంటుందా? జన్మతః వచ్చిన రంగు ఇలా క్రీములు, లోషన్లతో మారుతుందంటే నమ్మశక్యంగా ఉందా అసలు? ఇక జుట్టుకు ఉపయోగించే షాంపూ వల్ల జుట్టు పొడుగ్గా, మరింత దృఢంగా పెరగడం ఎంతవరకు సాధ్యం? ఇటీవల వచ్చిన ఒక షాంపూ ప్రకటన ఇలా ఉంటుంది. ఒక పది మంది మగవాళ్లు ఎంత ప్రయత్నించినా కదల్చలేని ఒక లారీని ఒక యువతి వచ్చి తన పొడుగాటి జుట్టును దానికి కట్టి సునాయాసంగా లాగుతుంది. ఆమె జుట్టు అంత అందంగా దృఢంగా ఉండటానికి గల కారణం ఫలానా షాంపూ. ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకోటి ఉంది. చుట్టుపక్కలంతా పల్లెటూరిలా ఉంటే ఈ అమ్మాయి మాత్రం చాలా కురచ దుస్తులు ధరించి ఉంటుంది. జుట్టు గురించిన ప్రకటనలో అమ్మాయి శరీర ప్రదర్శన అవసరమా?



ఇలాంటి అర్థం పర్థం లేని, అశ్లీలకరమైన ప్రకటనలు ఎన్నో ఉన్నాయి. అసలు ఇలాంటి ప్రకటనలు విపరీతంగా పెరిగిపోవడానికి గల కారణాల గురించి ఆలోచిస్తే ఎన్నో ఉన్నాయి. నిజంగా ఇలా అందాల ఆరపోతతో ఆయా ఉత్పత్తుల అమ్మకాలు పెరుగుతున్నాయా? లేదా ఇది కంపెనీల మాయాజాలమా? అందులో నటించే మోడల్స్‌ని విమర్శించి తప్పు పట్టలేం. డబ్బు కోసం తమ శరీరాలను, అందాన్ని ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారు మరి కొందరు. ఈ గ్లామర్ ప్రపంచపు మోజులో చేస్తున్నారు. అదే అవకాశంగా తీసుకుని ఈ విధమైన అభ్యంతరకరమైన ప్రకటనలు తయారు చేస్తున్నారు వివిధ ఉత్పత్తుల తయారీదారులు. ఈ ప్రకటనలు ఎంత వరకు సత్ఫలితాలనిస్తున్నాయి? చేరవలసిన వారికి ఈ ప్రకటనల సారాంశం చేరుతుందా? కుటుంబ సమేతంగా కూర్చుని చూసే విధంగా ఉన్నాయా ఈ ప్రకటనలు అంటే చాలా తక్కువే అని చెప్పొచ్చు. అసభ్యకరమైన ప్రకటనలను నియంత్రించగలిగేది ఎవరు? సదరు టీవీ చానళ్ల వారే ఈ క్రమంలో ఒక నిర్దిష్టమైన ప్రమాణాలు, నియమాలు పాటిస్తే మంచిదేమో? కాని మాకు ఆదాయాన్నిచ్చే ప్రకటనలను మేమెందుకు వదులుకోవాలి అంటారు వాళ్లు. చివరకు ప్రేక్షకులే ముఖ్యంగా మహిళలు ఎదురుతిరిగి శరీర ప్రదర్శనకు ప్రాముఖ్యాన్ని ఇచ్చే ప్రకటనలను నిలువరించగలరు. లేదంటే ముందు ముందు ఇంకా ఎంతగా దిగజారుతాయో ఈ వ్యాపార ప్రకటనలు?
Categories: Middle