http://rachanathecreation.blogspot.com/feeds/posts/default?alt=rss

Syndicate content
తెలుగు సాంకేతిక బ్లాగు
Updated: 1 day 16 hours ago

Geek Uninstaller - అనవసరమైన ప్రోగ్రాములను పీసీ నుండి తొలగించటానికి...

Fri, 05/18/2012 - 02:30
సాధారణంగా మన పీసీ నుండి అనవసరమైన ప్రోగ్రాములను తొలగించటానికి కంట్రోల్ ప్యానల్ లోని 'Add Remove Programs' ని ఉపయోగిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి తొలగించిన సాప్ట్ వేర్ కి సంబంధించిన ఫైల్స్ మరియు రిజిస్ట్రీ ఎంట్రీలు అలానే ఉండిపోతాయి. అలాకాకూండా తొలగించిన సాప్ట్ వేర్ మన పీసీ నుండి శాశ్వతంగా మరియు పూర్తిగా తొలగిపోవటానికి అడ్వాన్స్ డు టూల్స్ ఉపయోగించాలి. అలాంటిదే ఈ Geek Uninstaller, ఇది ఒక ఉచిత పోర్టబుల్ టూల్...

Geek Installer ని డౌన్లోడ్ చేసుకొని రన్ చేసినప్పుడు, ఇది మన పీసీ లో ఇనస్టలేషన్ చెయ్యబడిన అన్ని ప్రోగ్రాములను చూపిస్తుంది. తొలగించవలసిన ప్రోగ్రామ్ పై మౌస్ రైట్ క్లిక్ చేసి ’Uninstall...' పై క్లిక్ చెయ్యాలి. మరింత సమాచారం కోసం Geek Uninstaller సైట్ చూడండి.
ఇటువంటిదే మరొక బెస్ట్ టూల్ Revo Uninstaller దీని గురించి ఇక్కడ చూడండి.
డౌన్లోడ్: Geek Uninstaller
ధన్యవాదాలు
Categories: Left

VideoCacheView - యూట్యూబ్ స్ప్లిట్ వీడియోలను ఒకే ఫైల్ గా కాపీ చేసుకోవటానికి...

Wed, 05/16/2012 - 08:14
మనం ఏదైనా సైట్ కి వెళ్ళి వీడియోలను చూసినప్పుడు ఆ వీడియోలు బ్రౌజర్ Cache లో స్టోర్ చెయ్యబడతాయి. VideoCacheView అనే ఉచిత టూల్  బ్రౌజర్ Cache ని పూర్తిగా స్కాన్ చేసి దానిలోని ఆడియో/ వీడియో ఫైళ్ళను చూపిస్తుంది, కావలసిన వాటిని సులువుగా హార్డ్ డిస్క్ లోకి కాపీ చేసుకొని ఆఫ్ లైన్ లో చూసుకోవచ్చు. ఈ టూల్ Internet Explorer, Firefox, Google Chrome మరియు  Opera లను సపోర్ట్ చేస్తుంది. క్రొత్త వెర్షన్ లో యూట్యూబ్ సైట్ లో చూసిన స్ప్లిట్ వీడియోలను ఈ టూల్ ఒకే ఫైల్ గా చూపిస్తుంది, దానినే కాపీ చేసుకుంటే సరిపోతుంది. 

NirLauncher, WakeMeOnLAN, NetBScanner మొదలగు ప్రముఖ అప్లికేషన్లను అందించిన NirSoft VideoCacheView ని రూపొందించింది. మరింత సమాచారం కోసం VideoCacheView సైట్ చూడండి.
డౌన్లోడ్: VideoCacheView
ధన్యవాదాలు
Categories: Left

Flip PDF to Word - మల్టిపుల్ పీడీఎఫ్ ఫైళ్ళను ఒకేసారి వర్డ్ లోకి మార్చటానికి...

Wed, 05/16/2012 - 06:13
పీడీఎఫ్ పైళ్ళను మనకు కావలసిన విధంగా ఎడిట్ చెయ్యటం కోసం టెక్స్ట్ లేదా వర్డ్ పైళ్ళు గా కన్వర్ట్ చేసుకోవలసి ఉంటుంది. పీడీఎఫ్ నుండి వర్డ్ లోకి మార్చటానికి నెట్ లో అనేక అప్లికేషన్స్ దొరుకుతాయి. అలాగే Flip PDF to Word అనే ఉచిత అప్లికేషన్  కూడా పీడీఎఫ్ పైళ్ళను PDF నుండి Word లోకి మార్చటానికి ఉపయోగపడుతుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే అనేక PDF ఫైళ్ళను ఒకేసారి Word లోకి మార్చవచ్చు(Batch Convert Mode) . మరొక ప్రత్యేకత Hot Directories Mode అంటే ఒక ప్రత్యేక ఫోల్డర్ లో పీడీఎఫ్ ఫైల్ కాపీ చేస్తే అవి ఆటోమాటిక్ గా వర్డ్ ఫైల్ గా మార్చబడుతుంది. అంతేకాకుండా Command Line Mode కూడా దీనిలో ఉంది. 

Feature:
1. Free of charge to convert PDF file to editable Word document, with all the original text, images, graphics, hyperlinks, layout and formatting exactly preserved.
 
2. The output Word document has no text boxes which makes PDF editing easier.
3. Support exporting Microsoft Office Word 2003/2007/2010.
4. Support Command line mode and watched folder (Hot Dir) mode to convert pdf to word.డౌన్లోడ్: Flip PDF to Wordధన్యవాదాలు
Categories: Left

DesktopNow Remote Computer Access : మీ పీసీ LAN లేదా ఇంటర్నెట్ లో వెబ్ యాక్సెస్ చెయ్యటానికి!!!

Fri, 05/11/2012 - 06:08
DesktopNow అనే ఉచిత అప్లికేషన్ ని ఉపయోగించి మన పీసీ లో కావలసిన ఫైల్స్ మరియు ఫోల్డర్లను లోకల్ ఏరియా నెట్ వర్క్ (LAN) లేదా ఇంటర్నెట్ లో వెబ్ బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చెయ్యటానికి ఉపయోగపడుతుంది. ఇది దాదాపు అన్ని బ్రౌజర్లలో పనిచేస్తుంది.  DesktopNow డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి. ఇనస్టలేషన్ సమయం లో కొన్ని అనవసర అప్లికేషన్లు కూడా ఇనస్టలేషన్ చెయ్యబడతాయి కాబట్టి వాటిని అన్-చెక్ చేసి 'Finish' పై క్లిక్ చెయ్యాలి. 
ముందుగా అకౌంట్ సెటప్ దగ్గర మన ఈ-మెయిల్ ఐడీ మరియు పాస్ వార్డ్ ఎంటర్ చెయ్యాలి. LAN/WAN లో మన పీసీ ని యాక్సెస్ చేసేటప్పుడు  ఈ-మెయిల్ ఐడీ మరియు పాస్ వార్డ్ ఇవ్వవలసి ఉంటుంది. 
నెక్స్ట్ లో మనం షేర్ చెయ్యవలసిన ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకోవాలి.


నెక్స్ట్ స్టెప్ లో క్లౌడ్ యాక్సెస్ అవసరమైతే అక్కడ చెక్ బాక్స్ లో టిక్ పెట్టి ’Finish' పై క్లిక్ చెయ్యాలి.



సెటప్ పూర్తి అయ్యి అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత ’Tools' ---> 'Options' లో ’Web Acces' టాబ్ లో Local Network, Public Network ల దగ్గర లింక్స్ ఉంటాయి వాటిని ఉపయోగించి వేరొక పీసీ లో వెబ్ బ్రౌజర్ ద్వారా మన పీసీ లో షేర్ చెయ్యబడిన ఫైల్స్ లేదా ఫోల్డర్లను యాక్సెస్ చెయ్యవచ్చు. 





డౌన్లోడ్: DesktopNow

ధన్యవాదాలు
Categories: Left

IVRS ద్బారా ఇక APSRTC టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు....

Wed, 05/09/2012 - 02:40
రోజుకు 22265 బస్ లతో 79 లక్షల కిలో మీటర్లు ప్రయాణిస్తూ 127.09 లక్షల ప్రయాణీకులను తమ గమ్యాలను చేరుస్తూ అతిపెద్ద రవాణా సంస్థగా గిన్నీస్ బుక్ ఎక్కిన Andhra Pradesh State Road Transport Corporation (APSRTC) సంస్ధ Interactive Voice Response System-based (IVRS) ఆధారిత సిస్టం ద్వారా బస్ టికెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని నిన్న ప్రారంభించింది. దీంతో ఈ పద్ధతిలో టికెట్ బుక్ చేసుకొనే సదుపాయాన్ని కల్పించే మొదటి రాష్ట్రం గా అవతరించింది. దీనికోసం APSRTC  Abhibus తో ఒక ఒప్పందం కురుర్చుకుంది. 

ప్రయాణీకులు 1800-200-4599 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసి కాల్ సెంటర్ ఆపరేటర్ కి మన ప్రయాణం సంబందించిన ఎక్కవలసిన/ దిగవలసిన ప్రదేశాలు,  తేదీ, సమయం తదితర వివరాలు తెలియచెయ్యాలి.  సీట్ల లభ్యత ను అనుసరించి కావల్సిన బస్ ని ఎంచుకొని మన మొబైల్ నంబరు మరియు మెయిల్ ఐడీ తెలియచెయ్యాలి. టికెట్ బుక్ అయిన తర్వాత టికెట్ సంబంధించిన వివరాలు/ఈ-టికెట్ వాటికి పంపబడతాయి. పైన తెలిపిన వివరాలు చెప్పిన తర్వాత IVRS కు అనుసంధానం చెయ్యబడుతుంది, అక్కడ తెలియ చేసే సూచనలకనుగుణంగా మన క్రెడిట్/ డెబిట్ కార్డ్ వివరాలు ఎంటర్ చెయ్యాలి. 
సేకరణ: హిందూ దిన పత్రిక నుండి
ధన్యవాదాలు 
Categories: Left

IRCTC సైట్ లో తత్కాల్ టిక్కెట్స్ బుక్ చేసే వారికి ఉపయోగపడే Magic Autofill టూల్!!

Tue, 05/08/2012 - 01:10
IRCTC సైట్ లో కన్ఫార్మ్ డు తత్కాల్ టిక్కెట్స్  బుక్ చేసుకోవటం చాలా కష్టం... మనం సైట్ లో టికెట్ బుక్ చేసుకునే లోపే కౌంటర్ లో తత్కాల్ కోటా అయిపోతుంది.  అందుకే తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకోవటం కోసం తెల్లవారుజాముకే కౌంటర్ల్ల దగ్గర పడిగాపులు కాయాల్సివస్తుంది లేదంటే ఏజెంట్ పై ఆధారపడవలసి వస్తుంది. ఇక్కడ చెప్పబోయే చిన్న ఆటోఫిల్ టూల్ ఉపయోగించి ప్రయాణీకుల పేర్లు తదితర వివరాలను ముందుగా సిద్ధం చేసుకొని తర్వాత IRCTC సైట్ లో ఆటో ఫిల్ చేసుకోవచ్చు దీంతో ఆ సైట్ లో ప్రయాణీకుల వివరాలను ఎంటర్ చెయ్యటానికి పట్టే సమయాన్ని ఆదాచెయ్యవచ్చు.
అదెలాగో ఈ క్రింది డిజిటల్ ఇన్స్ఫిరేషన్ వీడియో చూడండి:


పై వీడియోలో తెలిపిన Magic Autofill ఫార్మ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి, అక్కడ ప్రయాణీకుల వివరాలను ఎంటర్ చేసి ’I'm feeling lucky' పై క్లిక్ చెయ్యాలి, తర్వాత అక్కడ వచ్చే ’Magic Autofill' ని బుక్ మార్క్ టూల్ బార్ లోకి డ్రాగ్ చెయ్యాలి. ఇప్పుడు IRCTC సైట్ కి వెళ్ళినప్పుడు ’Passeger Details' దగ్గర ప్రయాణీకుల విరాలు ఆటోమాటిక్ గా ఫిల్ చెయ్యటం కోసం బుక్ మార్క్ చేసుకున్న ’Magic Autofill' పై క్లిక్ చెయ్యాలి అంతే.

సేకరణ: Digital Inspiration నుండి.

ధన్యవాదాలు
Categories: Left

స్టూడెంట్స్ కోసం సెర్చ్ ఎడ్యుకేషన్[Search Education] ని ప్రారంభించిన గూగుల్...

Mon, 05/07/2012 - 06:49
గూగుల్ సెర్చ్ ని ఎలా ఉపయోగించాలనే దానిపై విద్యార్ధులను ఎడ్యుకేట్/ ట్రైనింగ్ ఇవ్వటం కోసం గూగుల్ సెర్చ్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్ ని ప్రారంభించింది. ఈ సైట్ విద్యార్ధులకే కాక ఉపాధ్యాయులకు కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ  Lesson Plans తో పాటు Live Training ని కూడా అందిస్తున్నారు. ఈ సైట్ లోని ట్యుటోరియల్స్ విద్యార్ధులు తమ కావలసిన సబ్జెట్ కి సంబంధించిన సరైన సమాచారాన్ని సెర్చ్ చెయ్యటం లో ఎంతగానో ఉపకరిస్తాయి.





వెబ్ సైట్: Google Search Education

ధన్యవాదాలు
Categories: Left

Orion File Recovery - డిలీట్ అయిన ఫైళ్ళను రికవర్ చెయ్యటానికి!!!

Sat, 05/05/2012 - 07:16
డాటా రికవరీ సాప్ట్ వేర్ల గురించి ఇంతకు ముందు చాలా పోస్టుల్లో చూశాం... వాటిలో Recuva ఒక బెస్ట్ డాటా రికవరీ టూల్ అని చెప్పవచ్చు.  Orion File Recovery Software ఇది మరొక ఫైల్ రికవరీ టూల్ ... దీనిని ఉపయోగించి లోకల్ హార్డ్ డిస్క్, ఎక్స్ టెర్నల్ హార్డ్ డిస్క్, మెమొరీకార్డ్ ల నుండి తొలగించిడ్ియో,ఆడియో, ఇమేజ్, డాక్యుమెంట్ మొ.   ఫైల్స్ ని రికవర్ చెయ్యవచ్చు.  Orion FAT మరియు NTFS ఫైల్ సిస్తమ్స్ ని సపోర్ట్ చేస్తుంది. రికవర్ చెయ్యబోయే డాటా సైజ్ ముందుగా తెలియచెయ్యటం వలన రికవర్ చేసుకోవటానికి సరిపోయే డ్రైవ్ ని ముందుగానే ఎంచుకోవచ్చు.
Orion ని ఇనస్టలేషన్ చేసేటప్పుడు FileFort Backup Software మరియు NCH Software Internet Browser Toolbar మొదలగు వాటిని కూడా ఇనస్టలేషన్ చేస్తుంది కాబట్టి వాటిని అన్-చెక్ చెయ్యండి. అప్లికేషన్ ని రన్ చేసిన తర్వాత డ్రైవ్ లేదా ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. రికవర్ చెయ్యవలసిన ఫైల్ టైప్ ని ఎంచుకోవాలి. రికవర్ చెయ్యబడే ఫైళ్ళను సేవ్ చేసుకోవటానికి సోర్స్ డిస్క్ కాకుండా వెరొక లొకేషన్ ఎంచుకోవటం ఉత్తమం.

Orion File Recovery works on Windows XP, Windows Vista, Windows 7 and Windows 8.Download Orion File Recovery Softwareధన్యవాదాలు
Categories: Left

అవయవదానాన్ని ప్రోత్సహించటానికి ఫేస్ బుక్ క్రొత్త ఫీచర్...

Thu, 05/03/2012 - 07:55
ప్రముఖ సోషల్ నెట్ వర్క్ ఫేస్ బుక్ అవయవదానాన్ని ప్రోత్సహించటానికి క్రొత్త ఫీచర్ 'Organ Donor' ని ’Time Line ' లోని ’Life Event' లో తెచ్చింది. మెడికల్ ఫీల్డ్ లో పని చేస్తున్న తన గర్ల్ ప్రెండ్ తో డిన్నర్ చేస్తున్నప్పుడు మాటల మధ్యలో వచ్చిన ఐడియాతో అవయవ దానం యొక్క ఆవశ్యకతను తెలియచెయ్యాలని  క్రొత్త ఫీచర్ యాడ్ చెయ్యనున్నట్లు ఫేస్ బుక్ CEO Mark Zuckerberg US television లో గుడ్ మార్నింగ్ అమెరికా షో లో తెలియచేశారు.   అంతేకాకుండా యాపిల్ కో-ఫౌండర్ స్టీవ్ జాబ్స్ నుండి కూడా స్పూర్తి పొందినట్లు చెప్పారు.  స్టీవ్ జాబ్స్ కి ఆయన చనిపోవటానికి సంవత్సరం ముందు లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేశారు.

ప్రస్తుతానికి ఈ ఫీచర్ US మరియు బ్రిటన్ దేశాలలో పరిచయం చేశారు. ఇక్కడ విజయవంతమైతే ఈ పీచర్ ని మిగతా దేశాల్లో విస్తరించనున్నారు.
ధన్యవాదాలు
Categories: Left

రైళ్ళలో ఇంటర్నెట్ సదుపాయం...

Wed, 05/02/2012 - 02:49
వై-ఫై టెక్నాలజీ ద్వారా రైలు లో ప్రయాణిస్తూ ఇంటర్నెట్ బ్రౌజ్ చేసే సదుపాయాన్ని త్వరలో పొందవచ్చు. శాటిలైట్ ఆధారిత వై-ఫై ని ఉపయోగించి భోగీల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిస్తారు.  పైలట్ ప్ర్రాజెక్ట్ క్రింద ప్రయోగాత్మకంగా న్యూఢిల్లీ నుండి కలకత్తా వెళ్ళే హౌరా రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఈ సర్వీస్ ని ప్రారంభించనున్నారు. ఇది పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి నెట్ వినియోగించటానికి ప్రయాణికులనుండి ఎటువంటి రుసుము వసూలు చెయ్యరు.  దీనికోసం  రూ.6.30 కోట్లు ఖర్చు చెయ్యనున్నారు.  ఇది విజయవంతమైతే మిగతా రైళ్ళలో కూడా అమలుచేస్తారు.


రైలు ఇంజిన్ కి అమర్చిన యాంటీనా శాటిలైట్ తో అనుసంధానం చెయ్యబడి ఉంటుంది, వై-ఫై ద్వారా భోగీల్లో ప్రయాణిస్తున్న వారు నెట్ పొందవచ్చు. నెట్ కి కనెక్ట్ అవ్వటం కోసం TTE  ఇచ్చిన నంబర్ కి మన మొబైల్ నుండి డయల్ చేసి పాస్ వార్డ్  పొందవచ్చు. 
KU band నుండి బ్యాండ్ విడ్త్ పొందటానికి అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అనుమతి ఇచ్చింది.
ధన్యవాదాలు
Categories: Left

మీ క్లౌడ్ అప్లికేషన్లన్నిటినీ ఒకే చోట నుండి మేనేజ్ చెయ్యటానికి...

Tue, 05/01/2012 - 05:02
కార్మిక సోదరులకు మేడే శుభాకాంక్షలు....




క్లౌడ్ ఆధారిత అప్లికేషన్లు  DropboxGoogle CalendarGoogle DocsPivotal TrackerGoogle TasksGitHub మొదలగు వాటిని ఆయా  సైట్లకు వెళ్ళకుండా ఒకే చోట నుండి మేనేజ్ చెయ్యవచ్చు దీంతో చాలా సమయాన్ని ఆదాచెయ్యవచ్చుఅంతేకాకుండా  ఆయా క్లౌడ్ అప్లికేషన్లను మీ టీమ్ మెంబర్స్ తో కలసి (యాక్సెస్, సింక్ మరియు డిస్కస్) పనిచెయ్యటానికి  Busyflow  అనే వెబ్ అప్లికేషన్ ఉపయోగపడుతుంది.   అదెలాగో ఈ క్రింది వీడియో లో చూడండి: 




Busyflow ఉపయోగించటానికి ముందుగా సైన్-అప్ చెయ్యాలి. లేదంటే గూగుల్ లేదా ట్విట్టర్ అకౌంట్ లతో లాగిన్ చెయ్యవచ్చు. లాగిన్ అయిన తర్వాత Hive పేరు ఇచ్చి వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకోవాలి. ఈ వర్క్ స్పేస్ లో వివిధ టూల్స్ ఉంటాయి. వాటిలో కావలసిన  దానిని Hive కి యాడ్ చెయ్యాలి.  కావలసిన అప్లికేషన్ ఎంచుకున్న తర్వాత యూజర్ నేమ్ , పాస్ వర్డ్ తో లాగిన్ చేసి పర్మిషన్ [Allow] ఇవ్వవలసి వస్తుంది. కావలసిన ఫైల్ పై డిస్కస్ చెయవచ్చు, వేరొక ఫైల్ అటాచ్ చెయ్యవచ్చు... Hive దగ్గర ఉన్న Settings పై క్లిక్ చేసి మెంబర్స్ యొక్క ఈ-మెయిల్ ఐడీ తో వారిని ఆహ్వానించవచ్చు.




మరింత సమాచారం కోసం Busyflow సైట్ చూడండి.


ధన్యవాదాలు
Categories: Left

Nomesoft USB Guard తో USB Port లను బ్లాక్ చెయ్యండి...

Mon, 04/30/2012 - 08:28
Nomesoft USB Guard అనే ఉచిత USB బ్లాకింగ్ సాప్ట్ వేర్ ని ఉపయోగించి మన పీసీ లోని USB పోర్ట్ లను బ్లాక్ చెయ్యవచ్చు. ఈ అప్లికేషన్ లోని Disable the Use of USB ఆప్షన్ ని ఎంచుకోవటం ద్వారా పీసీ కి కనెక్ట్ అయిన USB డ్రైవ్ లను ఇతరులు యాక్సెస్ చెయ్యకుండా చెయ్యవచ్చు. అంతేకాకుండా ఒకేఒక క్లిక్ తో ఎనేబుల్ లేదా డిసేబుల్ మరియు రీడ్ లేదా రీడ్/రైట్ యాక్సెస్ ఇవ్వవచ్చు.


డౌన్లోడ్: Nomesoft USB Guard
ధన్యవాదాలు
Categories: Left

మైక్రోసాప్ట్ SkyDrive తో ఫైల్స్ సింక్ చెయ్యటానికి డెస్క్‌టాప్ అప్లికేషన్!!!

Sat, 04/28/2012 - 11:55
SkyDrive తో 25GB ఉచిత ఆన్ లైన్ స్టోరేజ్ ని అందించిన మైక్రోసాప్ట్  ఇప్పుడు క్రొత్త SkyDrive తో 7GB ఉచిత స్టోరేజ్ ని మాత్రమే అందిస్తుంది.  నా స్కైడ్రైవ్ లాగిన్ అయినప్పుడు ఇంతకు ముందు 25GB స్టోరేజ్ ఉండేది అది కాస్తా 7GB అయిపోయింది. Manage Storage పై క్లిక్ చేసి 25GB కి ఉచితంగా అప్‌గ్రేడ్ చేసుకున్నాను.  

SkyDrive ని పీసీ నుండే సులభంగా యాక్సెస్ చెయ్యటానికి మైక్రోసాప్ట్ డెస్క్‌టాప్ అప్లికేషన్ ని రూపొందించింది. దీనిని ఇనస్టలేషన్ చేసిన తర్వాత పీసీ లో స్కైడ్రైవ్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. దీనిలో కాపీ చేసిన ఫైల్స్ ఆటోమాటిక్ గా skydrive.com సైట్ తో సింక్ చెయ్యబడుతుంది. దీంతో మన ఫైళ్ళను ఎప్పుడైనా ఎక్కడినుండైనా యాక్సెస్ చెయ్యవచ్చు. 



Features
  • Access your SkyDrive right from Windows Explorer—photos, documents, and all your other important files.
  • Quickly add new files to SkyDrive by dragging them to the SkyDrive folder.
  • Easily organize your files and folders in SkyDrive, just like any other folder.
  • Connect back to your PC if you forget to put something in SkyDrive.

SkyDrive ని ఉపయోగించటానికి విండోస్ లైవ్ ఐడీ అవసరం ఇది లేని వాళ్ళు ఒకటి క్రియేట్ చేసుకోవాలి. హాట్ మెయిల్ ఐడీ కూడా ఉపయోగించుకోవచ్చు. 
డౌన్లోడ్: SkyDrive 
ధన్యవాదాలు
Categories: Left

కంప్యూటర్లు ఉపయోగించేటప్పుడు కళ్ళ విషయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు!!!

Fri, 04/27/2012 - 08:06
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు.... కంప్యూటర్లు, టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్స్ మరియు ఇతర డివైజ్ లు ఎక్కువ సమయం ఉపయోగించేటప్పుడు కళ్ళకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వలన తలనొప్పి రావటం, కళ్ళు ఎండిపోయి ఎర్రబారి మంటలు పుట్టటం మరియు చూపు చెదిరినట్లు అవటం మన గమనించే ఉంటాం.
ఈ ఆధునిక డిజిటల్ ప్రపంపచం లో కంప్యూటర్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్ లు ఉపయోగించేటప్పుడు కళ్ళకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి ఈ క్రింది చిత్రాలలో చూడండి: 


మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.


ధన్యవాదాలు
Categories: Left

డ్రాప్ బాక్స్ క్విక్ లింక్ తో ఇక ఫైల్ లేదా ఫోల్డర్ షేర్ చెయ్యటం చాలా సులువు...

Fri, 04/27/2012 - 01:22
ఉచిత ఆన్ లైన్ స్టోరేజీ ని అందిస్తున్న Dropbox లో ఇప్పుడు కావలసిన ఫైల్ లేదా ఫోల్డర్ మనకు కావలసిన వారితో షేర్ చేసుకోవటానికి ’Get Link' అనే ఆప్షన్ జత చెయ్యబడింది. డ్రాప్ బాక్స్ లో లాగిన్ అయ్యి షేర్ చెయ్యవలసిన ఫైల్ లేదా ఫోల్డర్ వరుసలో చివరన ఉన్న లింక్ గుర్తు పై క్లిక్ చెయ్యాలి. బ్రౌజర్ లో లింక్ ఓపెన్ అవుతుంది, అడ్రస్ బార్ లో ఉన్న లింక్ ని కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ తో షేర్ చేసుకోవచ్చు. అవతలి వారు సైన్-ఇన్ చెయ్యకుండానే మన ఫైల్ లేదా ఫోల్డర్ ని బ్రౌజర్ లో చూడగలరు.

మరింత సమాచారం కోసం డ్రాప్ బాక్స్ అఫీషియల్ బ్లాగ్ చూడండి.
ధన్యవాదాలు
Categories: Left

Google Drive - 5 GB ఉచిత స్టోరేజ్!!!

Thu, 04/26/2012 - 08:39



Google Drive. Keep everything. Share anything. Access everywhere. Google Drive is everywhere you are—on the web, in your home, at the office and on the go. So wherever you are, your stuff is just...there. Ready to go, ready to share. Get started with 5 GB free.
Google Drive is available for:
  • PC and Mac
  • iPhone and iPad (coming soon)
  • Android devices
Store your files in a
safe place. Things happen. Your phone goes for a swim. Your laptop takes an infinite snooze. No matter what happens to your devices, your files are safely stored in Google Drive. Go beyond storage. Collaborate. Google Drive lets you do more than just store your files. Share files with exactly who you want and edit them together, from any device.
Google Drive gives you instant access to Google Docs, a suite of editing tools that makes working together better—even when your teammates are miles away. Free Get 5 GB for free. Get started with 5 GB of free space. Upgrade to 25 GBfor less than $2.50 a month, and you can store practically everything for next to nothing.
మరింత సమాచారం కోసమ్ ఇక్కడ చూడండి.

వెబ్ సైట్: https://drive.google.com/start 

 ధన్యవాదాలు
Categories: Left

కరప్ట్ అయిన Excel ఫైల్ డాటా రికవర్ చెయ్యటానికి!!!

Thu, 04/26/2012 - 04:03
కరప్ట్ అయిన Excel వర్క్ షీట్స్ లోని డాటా రికవర్ చెయ్యటానికి Excel Recovery అనే ఉచిత అప్లికేషన్ ఉపయోగపడుతుంది. మైక్రోసాప్ట్ సూచించిన వివిధ ఎక్సెల్ డాటా రికవరీ పద్ధతులను అనుసరిస్తూ రూపొందించిన ఈ అప్లికేషన్ ని ఉపయోగించి పాడైన ఫైళ్ళను HTML లేదా SYLK ఫార్మేట్లలో ఓపెన్ లేదా సేవ్ చెయ్యటం మొదలగు పధ్ధతతులను ఉపయోగించి డాటా రికవర్ చెయ్యవచ్చు. 

దీనిలోని ఇతర పద్ధతులు : Opening the corrupt workbook with calculations to manual or in safe mode
Opening in the Excel Viewer or WordPad,
Opening the file in open and repair
Open and extract data modes, and using the external references method.

డౌన్లోడ్: Excel Recovery

ధన్యవాదాలు
Categories: Left

Wolfram Education Portal: లెక్కల టీచర్ల కోసం..

Thu, 04/26/2012 - 04:02
ఉపాద్యాయులు మరియు విద్యార్ధులకు ఉపయోగకరమైన ఎడ్యుకేషనల్ టూల్స్ అందిస్తున్న Wolfram , లెక్కల కాన్సెప్ట్స్ సులభంగా  విద్యార్ధులకు అర్ధమయ్యేలా వివరించటం కోసం టీచర్ల కోసం ప్రత్యేకమైన టూల్ ని రూపొందించింది, అదే Wolfram Education Portal.  ఇక్కడ ప్రధానంగా algebra మరియు calculus పైనే ఫొకస్ చేశారు. సైట్ లో లాగిన్ చెయ్యటానికి Wolfram ఐడీ కోసం టీచర్లు ముందుగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత Wolfram CDF Player ని డౌన్లోడ్ చేసుకుని ఇనస్టలేషన్ చేసుకోవాలి. ఈ సైట్ లో eTextbook, lesson plan, demonstration tools మరియు widgets ఉన్నాయి.



వెబ్ సైట్: http://education.wolfram.com/  ధన్యవాదాలు
Categories: Left

మీకు కావలసిన రైలు ఎక్కడ ఉందో తెలుసుకోవటానికి [Spot your train]!

Fri, 04/13/2012 - 05:44
మనం ఎక్కవలసిన లేదా మనం ఎవరినైనా రిసీవ్ చేసుకోవటానికి స్టేషన్ కి వెళ్ళాలంటే కనుక వాళ్ళు వస్తున్న రైలు ఎన్ని గంటలకు వస్తుంది, ఎక్కడ ఉంది, ఎంత లేటు, వాటి రాక/ పోక అనే విషయాలను రైల్వే ఎంక్వరీ  కి ఫోన్ చేసి కనుక్కుంటాం, ఒక్కొక్కసారి ఫోన్ లో చాలా సమయం వేచి ఉండవలసి కూడా వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు పైన తెలియచేసిన వివరాలను ఆన్ లైన్ లో కూడా చూడవచ్చు. దాని కోసం భారతీయ రైల్వే నిర్వహిస్తున్న  http://www.trainenquiry.com/o/indexNS.aspx అనే సైట్ ఉపయోగపడుతుంది. అయితే ట్రైన్ నంబరు తెలిసి ఉండాలి. ’Enter Train Number' దగ్గర ట్రైన్ నంబర్ ఎంటర్ చేసి ’Search' పై క్లిక్ చెయ్యాలి. తర్వాత ట్రైన్ పేరు సెలెక్ట్ చేసుకొని ఏ స్టేషన్ వద్ద మీకు దాని రాకపోకలు కావాలో ఆ స్టేషన్ ని సెలెక్ట్ చేసుకొని ఈరోజు ట్రైన్ వివరాల కోసం ’for todays train' దగ్గర ’Go' పై క్లిక్ చెయ్యాలి.  

అయితే పై సైట్ స్ధానం లో  క్రొత్త సైట్ రాబోతుంది, అది బీటా దశలో ఉంది, దానిని ఇక్కడ చూడవచ్చు http://www.trainenquiry.com/. ఇక్కడ సెర్చ్ లో రైలు నంబర్ ఎంటర్ చెయ్యాలి, రైలు వివరాలు వస్తాయి, కావలసిన రోజు పై క్లిక్ చెయ్యాలి.


వెబ్ సైట్: http://www.trainenquiry.com/

ధన్యవాదాలు
Categories: Left

పీడీఎఫ్ ఫైళ్ళను Merge లేదా Split చెయ్యటానికి ఆన్ లైన్ టూల్!!

Thu, 04/12/2012 - 02:23
ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదా అప్లికేషన్ ఇనస్టలేషన్ చెయ్యకుండా ILovePDF సైట్ కి వెళ్ళి పీడీఎఫ్ ఫైళ్ళను Merge లేదా Split చెయ్యవచ్చు.  సైట్ కి వెళ్లగానే ఈ క్రింది చిత్రం లో లా కనిపిస్తుంది.

ఫీడీఎఫ్ ఫైళ్ళను మెర్జ్ చెయ్యటానికి ’Merge PDF files' పై క్లిక్ చెయ్యాలి, తర్వాత ’ Select PDF Files' పై క్లిక్ చేసి మెర్జ్ చెయ్యవలసిన ఫైళ్ళను సెలెక్ట్ చేసుకోవాలి. 
ఫైళ్ళను ఎంచుకున్న తర్వాత ’ Merge PDFs' పై క్లిక్ చెయ్యాలి. ఫైళ్ళు ఒక్కొక్కటిగా జత చెయ్యబడిన తర్వాత డౌన్లోడ్ కి సిద్ధమవుతుంది, Download లింక్ పై క్లిక్ చేసి మెర్జ్ చెయ్యబడిన ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అలాగే పెద్ద ఫైల్ ని చిన్న చిన్న ఫైల్స్ గా స్ప్లిట్ చెయ్యటానికి  'Split PDF'  పై క్లిక్ చెయ్యాలి (మొదటి చిత్రం చూడండి).
అయితే మెర్జ్ లేదా స్ప్లిట్ చెయ్యటానికి కొన్ని పరిధులు ఉన్నాయి వాటిని ఇక్కడ చూడండి:

వెబ్ సైట్: ILovePDF
ధన్యవాదాలు
Categories: Left