http://www.24gantalu.co.cc/feeds/posts/default?alt=rss

Syndicate content
A news site from hyderabad dealing with regular telugu news and Andhra news, telangana news. Targetting NRIs and telugu netizens. you can find politics, entertainment, offbeat stories in this site.
Updated: 43 min 24 sec ago

మెగా మోడ్రన్ ఫ్యామిలీ

Sun, 02/05/2012 - 06:53
ఈ ఫోటో చూడండి.. ఎంత అందంగా మనవాళ్లు ఫోజులిచ్చారో.. మెగా కుటుంబానికి చెందిన వాళ్లంతా విదేశాలకు వెళ్లినప్పుడు సరదాగా ఇచ్చిన ఫోజ్ ఇది.. ఎంత మోడ్రన్ ఫ్యామిలోనో కదా..!
Categories: Middle

సంక్రాంతి అయ్యింది.. మార్చి, ఏప్రిల్ మిగిలింది

Sun, 02/05/2012 - 06:51
తెలంగాణ ఉద్యమాన్ని దఫదఫాలుగా వాయిదా వేస్తూ వస్తున్న తెలంగాణ జేఏసీ, టీఆర్ ఎస్ పార్టీలు.. ఇప్పుడు మరో కొత్త పల్లవి అందుకున్నాయి. సంక్రాంతి తర్వాత తేల్చుకుంటామంటూ డిసెంబర్ నెలలో నానా హడావిడి చేసినవాళ్లు కాస్తా.. పండుగయ్యాక ఒకే ఒక్క ధర్నాతో సరిపెట్టారు. ఇక తెలంగాణ ఉద్యమ రధసారధిగా చెప్పుకునే కేసీఆర్, చాలా వరకూ ఇంటికే పరిమితమవుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఆయన బయటకు వచ్చిన కనిపించిన సంఘటనలు చాలా తక్కువ. ఇవాళ మంచిర్యాలలో పర్యటించిన కేసీఆర్.. మళ్లీ మార్చి తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. అయితే, పరీక్షలు ఉండే మార్చి, ఏప్రిల్ నెలలను ఎందుకు ఎంచుకుంటున్నారన్నది అంతుచిక్కని ప్రశ్న. లేదంటే, అప్పుడు పరీక్షలను సాకుగా చూపించి వాయిదా వేస్తారేమో..? ఇప్పటికే తెలంగాణ జేఏసీ, టీఆర్ఎస్, ఇతర రాజకీయ పార్టీలను నమ్ముకొని సకలజనుల సమ్మెలో పాల్గొన్న ఉపాధ్యాయులంతా జీతాలందక చేతులు కాల్చుకున్నారు. వారి కోసం ఏవో ప్రెస్ మీట్లు పెట్టి డిమాండ్ చేయడం తప్పితే, జనం మధ్యకు వచ్చి పోరాడిన చరిత్ర ఈ పార్టీలకు లేదు. ఈ నేపథ్యంలో మరో విడత ఉద్యమం ఎలా జరుగుతుందన్నది ఊహించడం కష్టమే..
Categories: Middle

వడ్డీకి ఇచ్చారు... వ్యాపారం చేసుకోమన్నారు..

Sun, 01/29/2012 - 13:29
మద్యం మాఫియాలో చీకటి కోణం వెలుగులోకి వచ్చింది. మద్యం సిండికేట్లపై, ఎక్సైజ్ అధికారులపై ఏసీబీ పలు దఫాలుగా చేసిన దాడులు.. ఆశ్చర్యకరమైన వివరాలను బయటపెట్టాయి. సిండికేట్లను అరికట్టాల్సిన ఎక్సైజ్ అధికారులే.. వాళ్లకు అప్పులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని ఏసీబీ గుర్తించింది. సిండికేట్లపై ఏసీబీ రూపొందించిన 750 పేజీల నివేదికలో పలు కీలక విషయాలున్నాయి. ఏడు జిల్లాల్లో 22 ప్రాంతాల్లో 33 మద్యం సిండికేట్‌ కార్యాలయాలపై ఏసీబీ ఇటీవల దాడులు జరిపింది. మద్యం సిండికేట్లకు.. ఏసీబీ అధికారులు అప్పులు ఇస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఓ జిల్లాలో మద్యం సిండికేట్ నాయకుడికి ఆ ప్రాంత ఎక్సైజ్‌ సిబ్బంది రెండు కోట్ల 40 లక్షల రుపాయాలను అప్పుగా ఇచ్చారు. ఇందులో కేవలం ఓ హెడ్‌ కానిస్టెబుల్‌ వాటానే 53 లక్షలు ఉందంటే.. ఏ రేంజ్‌లో అవినీతి ప్రవాహం సాగిందో అర్థం చేసుకోవచ్చు. మరో జిల్లాలో ఎక్సైజ్‌ అధికారుల నుంచి అప్పు తీసుకున్నందుకు ఎక్సైజ్‌ ఇన్స్‌పెక్టర్‌కు 22 లక్షలు, ఓ సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ 10 లక్షల వడ్డీని కట్టారని ఆధారాలు దొరికాయి. ఓ జిల్లాకు చెందిన సిండికేట్‌ నాయకుడు మరో జిల్లాకు చెందిన ఇద్దరు ఇన్స్‌పెక్టర్‌లకు ఏడాది కాలంగా 37 లక్షల వడ్డీని చెల్లించినట్లు కీలక పత్రాలు ఏసీబీ చేతికి చిక్కాయి. ఈ ఆధారాలు చూస్తుంటే ఎక్సైజ్ అధికారులే మద్యం సిండికేట్లలో పెట్టుబడులు పెట్టి చీకటి వ్యాపారాన్ని పెంచి పోషిస్తున్నారని అర్థమవుతోంది. ఇప్పటి వరకూ ఎక్సైజ్‌ అధికారులు, 11 మంది మద్యం సిండికేట్ల నాయకులతో పాటు మరో 10 మందిని అరెస్టు చేశారు. ఇప్పటికి చిన్న చేపలే ఏసీబీకి చిక్కాయి.. ఇక పెద్ద చేపలు వలలో పడితే.. ఇంకెన్ని సమ్‌..గతులు బయటకువస్తాయో.. !
Categories: Middle

చంద్రబాబుపై గాలి మాటలు

Sun, 01/29/2012 - 13:27
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధానిమంత్రి కావాలని దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు కోరుకుంటున్నారని ఆ పార్టీ సీనియర్‌ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. బాబు ప్రధాని అయితే  దేశాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశం దొరుకుతుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ స్థాయిలో రోజురోజుకు దిగజారుతోందని వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి మూడో స్థానం దక్కుతుందన్నారు. మొత్తానికి బాబు ప్రధాని అభ్యర్థి అయితే బాగుంటుందని గాలి చెప్పడంతో.. టీడీపీలో వచ్చే ఎన్నికలకు ఏదో బలమైన స్కెచ్చే వేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Categories: Middle

మద్యం వ్యాపారులకు మూడింది

Sat, 01/28/2012 - 20:51
మద్యం సిండికేట్లపై రెండోరోజూ ACB దాడులు కొనసాగాయి. మొదటిసారి జరిపిన దాడుల్లో లభించిన ఆధారాల మేరకు ACB పక్కాగా దాడులు నిర్వహించింది. నెల్లూరు జిల్లాలో భారీగా అరెస్టులు చోటుచేసుకున్నాయి. సింగరాయకొండ ఎక్సైజ్ సీఐ గురవయ్య, సిండికేట్ అధ్యక్షుడు వెంకట్రావు, కోవూరు ఎక్సైజ్ ఎస్సై విజయకుమార్,బుచ్చిరెడ్డిపాళ్యం సిండికేట్ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లాలో మద్యం వ్యాపారి వెంకట్రావు ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు తర్వాత అరెస్ట్‌ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్న ఎక్సైజ్‌ సీఐ గురవయ్యని అదుపులోకి తీసుకున్నారు...ఇక ఉత్తరాంధ్రలో రెండ్రోజుల సోదాల్లో ముగ్గురు ఎక్సైజ్‌ అధికారులు, ఓ హెడ్‌కానిస్టేబుల్‌ సహా 11మందిని అరెస్ట్‌ చేశారు. సోదాల్లో ఎక్సైజ్‌ సిబ్బందితో పాటు మీడియా ప్రతినిధులకు నెలవారి కమిషన్లు అందినట్లు పక్కా ఆధారాలు లభించాయి. వ్యాపారుల అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ మద్యం డీలర్లు ACB కార్యాలయానికి తరలివచ్చారు. ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. వరంగల్‌లో ఎనిమిదిమంది వ్యాపారులతో పాటు ఓ ఎక్సైజ్‌ సీఐని అరెస్ట్‌ చేసిన ACB వారికి MGMలో వైద్య పరీక్షలు నిర్వహించింది. తర్వాత వారిని హైదరాబాద్‌ తరలించింది. ఇంతకాలం దర్జాగా సిండికేట్లతో దోచుకున్న అక్రమార్కులు ఎప్పుడు ACB విరుచుకుపడుతుందా అన్న ఆందోళనతో కాలం గడుపుతున్నారు.
Categories: Middle

టీడీపి వదిలినా..మేం పార్టీని వదలం..: హరికృష్ణ

Sat, 01/28/2012 - 20:44
టీడీపీలో ఫ్యామిలీ ఫైట్..హరికృష్ణను వెలివేస్తారా..?సీతయ్య టీడీపీని వీడుతారా..?బాలయ్య రాకతో ఆత్మరక్షణలో ..?టీడీపీలో మళ్లీ చక్రం తిప్పాలని భావిస్తున్న సీతయ్య.. స్పీడ్ పెంచారు. కొన్నాళ్లుగా పార్టీకి అంటీముట్టనట్లుగా ఉన్న ఆయన.. బాలకృష్ణ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడంతో, మళ్లీ యాక్టివ్ అయ్యారు.. పార్టీ కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటున్నారు. అయితే.. రాజకీయాల్లోకి వస్తానంటూ బాలయ్య ప్రకటించడంతోనే హరికృష్ణలో ఇంతమార్పు వచ్చిందన్న వార్తలు టీడీపీ వర్గాల్లో ప్రచారమవుతున్నాయి. దీనికి తోడు.. హరికృష్ణకు, జూనియర్ ఎన్టీఆర్‌కు చెక్ చెప్పడానికే.. చంద్రబాబు బాలయ్యను బరిలోకి దింపారన్న వాదనా ఉంది..హరికృష్ణ కూడా తాజా పరిణామాలతో కలత చెందినట్లే కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ తమను వదిలిపెట్టుకోవాల్సిందే తప్ప.. తాను,జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని వదలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తనలోనూ..తన కొడుకులోనూ ప్రవహించేది ఎన్టీఆర్ రక్తమేనన్నారు. ఎన్టీఆర్ పేరు భూమిమీద వినిపించినంతకాలం, టీడీపీ బతికే ఉంటుందన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరుకు వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హరికృష్ణ వ్యాఖ్యల్లో మర్మం ఏమిటి..? తనపై కుట్ర జరుగుతోందని హరికృష్ణ భావిస్తున్నారా..? ఇవే అనుమానాలు ఇప్పడు టీడీపీ కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నాయి. హరికృష్ణ వ్యాఖ్యలతో టీడీపీలో ఏదో గూడుపుఠాణీ జరుగుతోందన్న విషయం అర్థమవుతోంది. అయితే.. ఇది ఎంతవరకూ దారితీస్తుందన్నదే ఇప్పుడు సస్పెన్స్..
Categories: Middle

దాసరిపై చిరంజీవి ప్రతీకారం

Sat, 01/28/2012 - 09:22
దర్శకరత్న దాసరి నారాయణరావుకు, మెగాస్టార్ చిరంజీవికి అసలు పడదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకే వేదిక మీద ఉన్నప్పుడు చిరును పొగిడే దాసరి .. మరో వేదిక ఎక్కగానే మాత్రం విరుచుకుపడుతుంటారు. అయితే.. దాసరి విమర్శలకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం చిరంజీవికి మరోలా చేతికందింది. ప్రజారాజ్యాన్నివిలీనం చేసుకోనున్న కాంగ్రెస్ పార్టీనే ఈ అవకాశాన్ని అందిస్తోంది. రాష్ట్రం నుంచి త్వరలో ఆరు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. వీటిలో దాసరి సీటు కూడా ఉంది. ఇప్పటికే వరసగా రెండుసార్లు రాజ్యసభ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ దాసరికి అందించింది. మరోసారి ఇచ్చే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. దాసరి స్థానంలో, చిరంజీవికి అవకాశం కల్పించాలని హైకమాండ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. పీఆర్పీ విలీనం సమయంలో ఇచ్చిన హామీ మేరకే, ఈ అవకాశం ఇస్తున్నారు. మిగిలిన సీట్లలో రాజకీయంగా పోటీ ఉండడంతో, దాసరి స్థానంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన చిరంజీవికే ఛాన్స్ దక్కనుంది. ఈ రకంగా దాసరిపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం చిరంజీవికి వచ్చింది.
Categories: Middle

నెల్లూరి నెరజాణకు ఏమయ్యింది?

Sat, 01/28/2012 - 09:09
నెల్లూరి నెరజాణకు భారతదేశాన్ని ఊపేసిన నేపాలి సుందరి మనీషా కోయిరాల తాజా చిత్రమిది. ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో నటించిన మనీషా.. 2010లో వివాహం తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరమయ్యింది. అయితే.. ఇటీవలే ముంబైలో ఓ రెస్టారెంట్ ఓపెనింగ్ కు హాజరైన మనీషా.. ఫుల్ గా మందు కొట్టేసింది. ఆ తర్వాత ఇలా ఫొటోలకు చిక్కింది. అందాల తారగా కనిపించిన మనీషా.. ఒక్కసారిగా ఇంత దారుణంగా చూసి చాలా మంది తేరుకోలేకపోయారు. అయితే, కుటుంబ కలహాలతో మనస్తాపం చెందే ఇలా తయారయ్యిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
Categories: Middle

తెలుగువారికి ఈ సారీ అన్యాయమే..!

Wed, 01/25/2012 - 06:14
ఐదు పద్మవిభూషణ్‌లు, 27 పద్మ భూషణ్‌లు.. 77 పద్మశ్రీలు... వీటన్నింటిలోనూ మన రాష్ట్రానికి దక్కింది కేవలం రెండంటే రెండు పద్మశ్రీలు.. ఒకటి చిత్తూరు జిల్లాకు చెందిన మునిరత్నానికి, మరొకటి బ్యాడ్మింటన్ కోచ్ ఆరిఫ్‌కు దక్కాయి. ఢిల్లీ నుంచి తెలుగువ్యక్తి.. టి.వి.రాజేశ్వర్‌కు పద్మవిభూషణ్, ఎన్‌.ఆర్.ఐ కోటాలో జర్మనీలో ఉంటున్న తెలుగు వ్యక్తి పాటిబండ్ల చంద్రశేఖర్ రావుకు పద్మభూషణ్ పురస్కారం వరించాయి. రాష్ట్రం పంపించిన జాబితాలో సుప్రసిద్ధ దర్శకుడు, చిత్రకారుడు బాపు, భారత బ్యాడ్మింటన్ కే వన్నె తెచ్చిన గుత్తా జ్వాలల పేర్లున్నప్పటికీ, వారికి ప్రభుత్వం పట్టించుకోలేదు. బాపు పేరును కేంద్రం చాలాసార్లు తిరస్కరించింది. మీరానాయర్ కు, షబానా అజ్మీకి పద్మభూషణ్ లు ఇచ్చిన కేంద్రం, బాపూను తిరస్కరించడం దారుణమే..మనవాళ్లపై, తెలుగువాళ్లకు ఢిల్లీ పెద్దలు ఇస్తున్న గౌరవం ఏమిటో దీంతో మరోసారి స్పష్టమయ్యింది.
Categories: Middle

సచిన్‌కు ఈ సారి భారతరత్న లేనట్లే..!

Wed, 01/25/2012 - 03:04
సచిన్‌కు, సచిన్ అభిమానులకు నిరాశ కలిగించే వార్తఇది. భారతదేశ అత్యున్నత పురస్కారం, భారతరత్నను సచిన్ కు ఇవ్వాలంటూ చాలాకాలంగా డిమాండ్ దేశంలో ఊపందుకొంది. దీనికి తగ్గట్లే, క్రీడాకారులకు సైతం అవార్డు ఇవ్వొచ్చంటూ ఇటీవలే భారతరత్న నిబంధనల్లో మార్పులు కూడా చేశారు. ఇంకేముంది, ఈ సారి సచిన్ కు అవార్డు ఖాయమని అంతా అనుకున్నారు. కానీ, ఆ ఆశలను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అడియాశలు చేసింది. భారతరత్న అవార్డుకు ఈ సారి సచిన్ పేరును పంపలేదు. అయితే, దేశంలోని ప్రధాన క్రీడాకారులంతా కోరుకుంటున్నట్లు.. హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ పేరును మాత్రం అవార్డుకు సిఫార్సు చేసింది. చెప్పాలంటే, ధ్యాన్ చంద్ కు ఈ సారి భారతరత్న అవార్డు దక్కడం ఖాయంగానే కనిపిస్తోంది. దేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన తొలి క్రీడాకారుడు ధ్యాన్ చందే. అలాంటి మహోన్నత వ్యక్తికి ఇవ్వకుండా సచిన్ కు ఇవ్వమని కోరితే, విమర్శలు వస్తాయని భావించిన నేపథ్యంలోనే, ముందుగా ధ్యాన్ చంద్ పేరును సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే, భవిష్యత్తులో సచిన్ కు భారతరత్న పురస్కారం అందడం ఖాయంగానే కనిపిస్తోంది.
Categories: Middle

సునీల్‌రెడ్డి ఎవరు..? జగన్ తో సంబంధం ఏమిటి?

Tue, 01/24/2012 - 10:02
సునీల్ రెడ్డిది కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం అనిమెల గ్రామం.. నర్రెడ్డి సంగిరెడ్డి రెండో కుమారుడు ఈ సునీల్‌రెడ్డి. 30 సంవత్సరాల క్రితం సంగిరెడ్డి తన కుటుంబంతో సహా పులివెందులకు వచ్చి స్థిరపడ్డాడు. వైఎస్‌ బావ సీవీ సుబ్బారెడ్డికి ... సంగిరెడ్డి బంధువు కావడంతో వైఎస్‌ కుటుంబంతోనూ పరిచయం ఏర్పడింది. అప్పట్లో జియాలజిస్ట్‌గా పనిచేసిన సంగిరెడ్డి... వైఎస్‌ కుటుంబ సభ్యులతో కలిసి పులివెందుల ప్రాంతంలో మైన్స్‌ వ్యాపారాలు చేశాడు.. నష్టాలు రావడంతో సంగిరెడ్డి ఆర్ధికంగా కుంగిపోయాడు. దీంతో సంగిరెడ్డి ఆస్తులను కూడా వైఎస్‌ కుటుంబీకులు తీసుకున్నారని సమాచారం.  ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంగిరెడ్డి కుటుంబాన్ని YSR చేరదీశారు. సంగిరెడ్డి కుమారుడు సునీల్‌రెడ్డికి జగన్‌ కంపెనీలో ఓ చిరుద్యోగం ఇచ్చారు.. సునీల్‌లో ఉన్న చురుకుదనం, ఉత్సాహం గమనించిన జగన్‌.. సునీల్‌రెడ్డిని తన ఆంతరంగికుడిగా, వ్యక్తిగత సహాయకుడిగా నియమించుకున్నారు. అధికారికంగా పీఏ కాకపోయినా, అన్ని వ్యవహారాలను సునీల్ రెడ్డే నిర్వహించేవాడు. అతి తక్కువ కాలంలోనే జగన్‌ ఆర్థిక, వ్యక్తిగత కార్యకలాపాల్లో సునీల్‌ ప్రముఖ పాత్ర పోషించే స్థాయికి ఎదిగాడు. సునీల్ రెడ్డికి కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డితోనూ బంధుత్వం ఉంది. ఆయన సోదరుడి కుమార్తె కృష్ణతేజతో సునీల్ రెడ్డికి వివాహమ్యయింది. ఇప్పుడు సునీల్ రెడ్డిని సీబీఐ ప్రశ్నిస్తుండడంతో జగన్ కేసుపై మరింత ఉత్కంఠ పెరిగింది.
Categories: Middle

జగన్ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు

Tue, 01/24/2012 - 09:40
వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ జగన్ చుట్టూ సీబీఐ ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే విజయసాయి అరెస్ట్ తో జగన్కు కంటిమీద కునుకు లేకుండా చేసిన సీబీఐ అధికారులు, తాజాగా జగన్ సన్నిహితుడు, ఆయన భార్య భారతి బంధువు సునీల్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది. ఇవాళ ఉదయం గోపన్ పల్లిలోని సునీల్ రెడ్డి ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు, ఆయన్ను తమతో పాటు కార్యాలయానికి తీసుకెళ్లి, చాలా సేపు ప్రశ్నించారు. అనంతరం మళ్లీ ఆయన్ను తమ వాహనంలోనే ఇంటికి తీసుకువెళ్లి, అక్కడ సోదాలు చేశారు. సునీల్ రెడ్డి నివాసం నుంచి కీలక వివరాలను ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. జగన్ ఆస్తుల గురించి, అక్రమ పెట్టుబడుల గురించి చాలా వివరాలు సునీల్ రెడ్డికి తెలుసని సీబీఐ భావిస్తోంది. జగన్ వెన్నంటి ఉండే సునీల్ రెడ్డి కూడా, ఈ అక్రమాల్లో పాలుపంచుకున్నాడని అనుమానిస్తోంది. సునీల్ రెడ్డి అరెస్ట్ను ఇంకా ధృవీకరించకపోయినా, త్వరలోనే సీబీఐ జేడీ ఆ ప్రకటనా చేసే అవకాశం కనిపిస్తోంది. ఓ రకంగా జగన్ చుట్టూ ఉన్న అన్ని మార్గాలను మూసివేసి, అక్రమాలకు సంబంధించి పక్కా ఆధారాలు సంపాదించి ఆ తర్వాతే జగన్ పై దృష్టి పెట్టాలని సీబీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో A1 గా ఉన్న జగన్ ను వదిలి, ఒక్కొక్కరిపైనా పంజా విసురుతోంది. అయితే, జగన్ చుట్టూ ఉన్న వారిని అరెస్ట్ చేసి, ఆయన్ను ఆత్మరక్షణ నెట్టడానికి అధికారపార్టీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణలూ లేకపోలేవు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు అతి పెద్ద ప్రమాదంగా భావిస్తున్న జగన్ ను, సీబీఐతోనే చెక్ చెప్పి, తమకు లొంగి ఉండేలా చేసుకోవడానికే, ఈ తరహా దర్యాప్తును తెరపైకి తెచ్చిందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
Categories: Middle

పనీ పాటా లేనివాళ్లకే మనోభావాలా...?

Mon, 01/23/2012 - 09:51
ఉయ్ లైక్ బ్యాడ్ బాయ్స్... అంటూ బిజినెస్ మేన్ లో పెట్టిన పాట ఇప్పటికే వివాదాస్పదమైన సంగతి అందరికీ తెలిసింది. రాముడిని కించపరిచారని, పాటను సినిమా నుంచి తొలగించాలంటూ విశ్వహిందూ పరిషత్ కొన్ని రోజులుగా ఆందోళన చేస్తూనే ఉంది. కొంతమంది సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్లో దీనిపైనే ఇవాళ ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై స్పందన కోరినప్పుడు బిజినెస్ మేన్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. పనీపాటా లేనివాళ్లకే మనోభావాలుంటాయంటూ, కేసులు పెట్టడంపై ఘాటుగా స్పందించారు పూరీ. పాటపెట్టడమే పెద్ద తప్పైతే, అవమానించి, మరో తప్పు చేశారంటూ మండిపడుతున్నారు హిందుత్వ సంస్థల నేతలు.
Categories: Middle

వాడు.. వీడు..అనే తెలుగు రాజకీయ సినిమా

Mon, 01/23/2012 - 09:34
వాడు.. వీడు.. ఇది తమిళ డైరెక్టర్ బాల సినిమా కాదు.. తెలుగు రాజకీయ తెరపై ఆడుతున్న టాలీవుడ్ సూపర్ హీరోల సినిమా. అవును.. ఇందులో హీరోలు.. ఒకరు బాలకృష్ణ అయితే.. మరొకరు చిరంజీవి. రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ప్రకటించిందే తడువుగా.. చిరంజీవిని లక్ష్యం చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు నందమూరి హీరో. చిరంజీవికి తేరుకునే సమయం కూడా ఇవ్వకుండా వరసగా విమర్శల బాణాలను గుప్పిస్తున్నారు. కృష్ణా జిల్లా తొలిపర్యటనలో.. సామాజిక న్యాయాన్ని రాజకీయ అవసరానికి కొంతమంది వాడుకున్నారని, అదే తన తండ్రి ఎన్టీఆర్, ఆ పేరు చెప్పకుండానే బడుగుబలహీన వర్గాలకు అన్నీ చేశారని చిరంజీవి ఎద్దేవా చేస్తూ ప్రకటించారు. దీనిపై స్పందించిన చిరంజీవి.. బాలయ్యది పసిపిల్లాడి మనసని, ఆ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తీసిపడేశారు. అక్కడితో గొడవ అయిపోయిందంటే.. ఇవాళ(సోమవారం) విశాఖ పర్యటనలో మరోసారి బాలయ్య రెచ్చిపోయారు.."వాడెవడో.. నన్ను బాలుడన్నాడు... వాడు ఒకవైపే చూశాడు.. రెండోవైపు బాలకృష్ణ ఉన్నాడన్న సంగతి తెలియదంటూ.. "ఏకవచనంతో చిరంజీవికి ఏకిపారేశారు. దీన్ని బట్టి చూస్తే.. చిరంజీవితో తాడోపేడో తేల్చుకోవాలనే బాలయ్య డిసైడైనట్లు కనిపిస్తోంది. టాలీవుడ్లో ఇద్దరిదీ సమాన స్థాయే అయినా.. విజయాల పరంగా మెగాస్టార్ ఓ మెట్టు ముందే ఉన్నారు. మరి, రాజకీయాల్లోనైనా బాలయ్య నెగ్గుతారో లేదో చూడాలి..
Categories: Middle

ఉత్తరాంధ్రపై బాలయ్య కన్ను

Sun, 01/22/2012 - 02:15
కృష్ణాజిల్లాలో రాజకీయ పర్యటనతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం పుట్టించిన నందమూరి బాలకృష్ణ, ఉత్తరాంధ్రపై కన్నేశారు. తండ్రి స్థాపించిన పార్టీకి తిరిగి పునర్వైభవం తీసుకురావడానికి కకణం కట్టుకున్న బాలయ్య.. ఉత్తరాంధ్రలో పార్టీని పటిష్టం చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ఆది,సోమవారాల్లో విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. పాడేరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ, బహిరంగ సభల్లో పాల్గొంటారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్న బాలయ్య.. ఏదో ఓ ప్రాంతానికి పరిమితం కాకుండా.. రాష్ట్ర స్థాయి నేతగా ఎదగడానికే ఈ పర్యటనలు చేస్తున్నట్లు టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Categories: Middle

ఎర్ర ప్లేట్ లో తింటే బరువు తగ్గుతారా..!

Fri, 01/20/2012 - 07:22
రెడ్ ప్లేట్లో భోజనం ఓవర్ వెయిట్ కు రెడ్ సిగ్నల్ అంటున్నారు జర్మన్, స్విస్ పరిశోధకులు. ఇతర రంగుల పళ్లాలు, కప్పులతో పోల్చితే, ఎర్రటి రంగున్న పళ్లాలు, కప్పుల్లో భోజనం చేసినప్పుడు చాలా తక్కువగా తినడమే దీనికి కారణమట. ఎరుపు ప్రమాదానికి చిహ్నమని, ఆ రంగే చాలా తక్కువగా తినడానికి కారణమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. కొంతమంది మగాళ్లపై పరిశోధన చేసి మరీ దీన్ని రుజువు చేసుకున్నారట. నీలం, ఎరుపు రంగు కప్పుల్లో టీ ఇచ్చిన తాగమన్నప్పుడు.. నీలం కప్పులో టీతో పోల్చితే.. ఎర్ర కప్పులో 44 శాతం తక్కువగా టీ తాగారట. దీన్ని బట్టి బరువు తగ్గాలనుకుని, నోరు కట్టేసుకోలేని వారు ఎరుపురంగు ప్లేట్లో తింటే సరని చెబుతున్నారు. ప్రభుత్వం కూడా బార్లు, పబ్ లు ఎరుపు రంగులో ఉండేలా చూడడంతో పాటు, మద్యం, సిగరెట్లు, అనారోగ్యకరమైన ఆహార పదార్థాల ప్యాకెట్లు, ఎరుపు రంగులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జర్మన్, స్విస్ పరిశోధకులు కోరుతున్నారు.
Categories: Middle

సచిన్ డ్యాన్స్ ఎలా ఉంటుంది?

Fri, 01/20/2012 - 06:59
భారత క్రికెట్ ప్రపంచానికి ఆరాధ్య దైవం సచిన్ టెండుల్కర్.. సరదా సమయంలో ఎలా ఉంటాడో తెలిపే చిత్రమిది. క్రికెట్ గ్రౌండ్లో ఎప్పుడూ కూల్ అండ్ కామ్ గా ఉండే సచిన్, ఛాన్స్ వస్తే మాత్రం ఇలా స్టెప్పులతో ఇరగదీస్తానంటున్నాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా.. అతనూ మనలాంటి వాడేగా..
Categories: Middle

కిస్ కిక్: కత్రీనా లక్కీనా.. షారుక్ లక్కీనా.?

Wed, 01/18/2012 - 10:03
బాలీవుడ్ సెక్సీబాంబ్.. చిక్నీ చమేలీ.. కత్రీనా కైఫ్ కు ఘాటు ముద్దిచ్చాడు కింగ్ ఖాన్ షారుక్. కత్రీనా ప్రేమ కోసం ఏళ్ల తరబడి సల్మాన్ ఎదురు చూస్తూనే ఉండగా, అందరిముందూ.. కత్రీనా బుగ్గమీద ముద్దు పెట్టాడు షారుక్. కలర్స్ టెలివిజన్ ఇటీవలే నిర్వహించిన స్క్రీన్ అవార్డ్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కత్తిలాంటి కత్రీనాను చూడగానే ... బహుశా షారుక్ కంట్రోల్ తప్పి ఉంటాడు. షారుక్ కిస్ తో ఒక్కసారిగా షాక్ కు గురయ్యింది కత్రీనా. చాలాసేపు తేరుకోలేకపోయింది. ఇక షారుక్ కు ఇంటికెళ్లాక.. గౌరీఖాన్ తలెంటేసి ఉంటుంది. అన్నట్లు.. అసలే విరోధి.. పైగా ఘాటు లవర్.. కత్రీనాకు కిస్ ఇస్తున్న షారుక్ ను చూస్తే.. సల్మాన్కు ఎలాంటి ఫీలింగ్ కలిగి ఉంటుంది.. అదృష్టం బాగుండి.. ఆ కండలవీరుడు.. ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయలేదు.. కాబట్టి షారుక్ బతికిపోయిఉంటాడు.. లేదంటే, పబ్లిక్ గానే డిష్యూం..డిష్యూం.. అయిపోయేది.. ఇంతకీ షారుక్ కిస్ దక్కించుకున్న కత్రీనా.. లక్కీనా.. సైలెంట్ గా కలల సుందరికి ముద్దిచ్చేసిన షారుక్ లక్కీనా..?
Categories: Middle

మంత్రి కన్నా కొడుకు అరెస్ట్

Wed, 01/18/2012 - 01:26
విదేశాల నుంచి అక్రమంగా వస్తువులను తెచ్చిన కేసులో మంత్రి కన్నా కొడుకు ఫణీంద్ర అరెస్ట్ అయ్యాడు. కన్నా కుమారుడితో పాటు, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కుమారుడని కూడా డైరెక్టరేట్ ఆఫ్ రెవన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. లండన్ నుంచి దుబాయ్ మీదుగా వీరు హైదరాబాద్ వచ్చారు. వీరితో పాటు విలువైన మద్యం, ఎలక్ట్రానిక్ వాచీలు తీసుకొచ్చారు. వీటికి కస్టమ్స్ సుంకాన్ని చెల్లించకుండానే తరలిస్తున్నారు. తనిఖీల్లో ఈ విషయం బయటపడడంతో పాటు మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు.
Categories: Middle

మాయాబజార్ షూటింగ్లో మహానుభావులు

Tue, 01/17/2012 - 14:20
మాయాబజార్ షూటింగ్ కు సంబంధించిన అరుదైన ఫోటోల్లో ఇదీ ఒకటి. శ్రీకృష్ణుడు ఇచ్చిన ప్రియదర్శినిలో అభిమన్యుడిని శశిరేఖ చూసే సన్నివేశం ఇది. సినిమా దర్శకుడు కె.వి.రెడ్డిని, కెమెరా మాంత్రికుడు మార్కస్ బాంట్లేను కూడా చిత్రంలో చూడొచ్చు.
Categories: Middle