http://meeandarikosam.blogspot.com/feeds/posts/default?alt=rss

Syndicate content
ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములో జరుగుతున్న ముఖ్య విషయములను తెలుసుకొన వచ్హును NEWS/POLITICS/CURRENT AFFAIRS/ENTERTAINMENT/SCIENCE/HEALTH/EVENTS/SPORTS
Updated: 43 min 44 sec ago

బెల్జియం లో జరిగిన LED లైట్ల పండుగ...ఫోటోలు

Sat, 02/04/2012 - 10:56
బెల్జియం లో 2012 సంవత్సర లైట్ల పండుగను జరుపుకున్నారు. ఇందులో సుమారు 55,000 బల్బులు ఉపయోగించేరు. 92 అడుగుల ఎత్తుకు చెక్కలతో చర్చ్ లు అమర్చి వాటిని బల్బులతో అలంకరించేరు. ఎంతో ఎనర్జీ వ్రుధా చేస్తున్నారు అన్నవారికోసం 55,000 బల్బులు వెలగడానికి 20K వాట్స్ కరెంట్ మాత్రమే ఖర్చు అవుతోందని తెలిపేరు.







Categories: Right

1922 లోనే మొట్టమొదటి మొబైల్ ఫోన్...?....వీడియో

Sat, 02/04/2012 - 02:51
"ది వైర్ లెస్ పానల్" అనే ఒక సైలంట్ చిత్రానికి సంబంధించిన ఒక సినిమా రీలును బ్రిటీష్ పాతే అనే ఒక మల్టీమీడియా సంస్థకు అనుకోకుండా దొరికింది. ఈ చిత్రం 1922 లో తీయబడినది.



ఆ సినిమా క్లిపింగ్ చూసి వారు ఆశ్చర్యపోయేరు.ఎందుకంటే ఆ క్లిపింగ్ లో ఇద్దరు ఆడ మనుష్యులు వర్షం కురుస్తూంటే వారిదగ్గరున్న మొబైల్ ఫోన్ ను వాడటం, గొడుగు పైనున్న కడ్డీని అంటెనా గా చూపించడం చూసి మొబైల్ ఫోన్ టెక్నాలజీ 1922 లోనే వాడకంలో ఉన్నదా అని ఆశ్చర్యపోయేరు.ఆ సైలంట్ సినిమా రీలు తప్ప వారికి ఇంకేమీ వివరాలు దొరకలేదు. వివరాలకోసం వెతుకుతున్నారు. వివరాలు దొరికితే అది ప్రపంచానికి ఎంతో మేలు చేస్తుందని అనుకుంటున్నారు.


Categories: Right

బిలియనర్ అనే అనుభూతి కావాలంటే కొన్నిరోజులు జింబాబ్వేలో ఉండాలి...ఫోటోలు

Sat, 02/04/2012 - 01:56
ఇదీ... జింబాబ్వే లోని ఆర్ధికవ్యవస్థ.....25 మిల్లియన్ జింబాబ్వే డాలర్ల విలువ ఒక అమెరికన్ డాలర్ కు సమం. ఎందుకంటే అక్కడి ద్రవ్యోల్బణం సంవత్సరానికి 231 శాతం.

లోకల్ షాపులో షాపింగ్ చేయటానికి వెడుతున్న కుర్రాడు

పాకెట్ మనీ

అధిక ధరలు

హోటల్ బిల్లు చెల్లించడానికి

ఇదిగో అలాంటి బిల్లు

3 కోడి గుడ్ల ఖరీదు 100 బిలియన్ డాలర్లు

ఈమధ్యే 100 ట్రిలియన్ డాలర్ కాయితం విడుదలజేసేరు


కాబట్టి ఎవరైనా తాము ఒక బిలియనర్ అనే అనుభూతి కావాలనుకుంటే కొన్నిరోజులు జింబాబ్వేలో ఉండవచ్చు

ప్రస్తుత ఆర్ధిక విలువ 1 ట్రిలియన్ జింబాబ్వే డాలర్ = 33 అమెరికన్ డాలర్లు.

అందరూ గుర్తుపెట్టుకోవలసినది ఏమిటంటే 1980 లో 1 జింబాబ్వే డాలర్ విలువ 1 బ్రిటీష్ పౌండ్ కు సమం.......మరి ఇప్పుడు!!!!!
Categories: Right

ఇంగ్లాండ్ దేశంలో కుందేలు ఒలింపిక్స్...ఫోటోలు

Fri, 02/03/2012 - 10:25
యార్క్ సేర్(ఇంగ్లాండ్) లోని హరోగేట్ అనే చోట పోయిన వారం చివర కుందేలు ఒలింపిక్ పందేలు జరిగినై. సుమారు 3000 కుందేల్ల తో పాటు ఎలుకలూ,పందులూ కూడా ఈ ఒలింపిక్స్ లో పోటీ పడ్డాయి. 90 సంవత్సరాలుగా ఇలాంటి పందేలు ఇక్కడ జరుగుతున్నాయట.1997 లో హై జంప్ కేటగిరీలో డానిస్ కు చెందిన కుందేలు ఒక మీటర్ ఎత్తుకు ఎగిరి రికార్డ్ చేసిందట.లాంగ్ జంప్ లో 1999 లో మరో డానిస్ కుందేలు 10 అడుగుల దూరానికి ఎగిరి రికార్డ్ చేసిందట. ఈ సారి ఎక్కువ కుందేల్లు పోటీలలో పాల్గొన్నా ఆ పాత రికార్డులను మించలేదుట.












Categories: Right

మలేషియాలొ అస్తికలు బద్రపరుచుకునే గ్రుహం...ఫోటోలు

Fri, 02/03/2012 - 03:20
చని పోయిన తరువాత అస్తికలు బద్రపరుచుకునే చోటు. ఇలాంటివి రోమన్ కాలం నాటినుండే ఉన్నాయట. చనిపోయిన వాళ్ళకు వాళ్ళ ఆచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి ఆ తరువాత వాళ్ళ అస్తికలు బద్రపరుచుకోవటానికి ఏర్పరిచిన గ్రుహం.దీనిని కొలంబేరియం అంటారు. తెలుగులో చెప్పాలంటే భూతల శ్మశానగ్రుహం అనవచ్చు. చనిపోయినవారి ఆప్తులు సంవత్సరానికి ఒక సారి ఇక్కడకు వచ్చి స్మరించుకుంటారు. మలేషియాలో ఉన్న ఈ కొలంబేరియం పూర్తిగా ఏర్ కండిషన్ చేయబడింది.











Categories: Right

వింత అమరికలు ఉన్న కొన్ని దేశాలు...ఫోటోలు

Thu, 02/02/2012 - 03:14
కెనడా...ఎక్కువ చెరువులు ఉన్న దేశం.3 మిల్లియన్ చెరువులు ఈ దేశంలో ఉన్నాయట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చెరువులలో 60 శాతం ఇక్కడే ఉన్నాయట.

ఇండోనేషియా....ఎక్కువ ఐలాండ్స్ ఉన్న దేశం.17,500 ఐలాండ్స్ ఉన్న దేశం.

లిబియా...99 శాతం ఎడారిగా ఉన్న దేశం.

మంగోలియా...తక్కువ జనాభా ఇరుకులో ఉంటున్న దేశం.

సూరినమే....అడవిలో ఉన్న దేశం. ఆఫ్రికన్ ట్రైబ్స్ ఉంటున్నారు.

యూక్రైన్...వేగంగా అంతర్ధానం అవుతున్న దేశం.....కారణం ఇక్కడ జనాభా ప్రక్రుతిగానే తగ్గిపోతోంది. ఇలాగే ఉంటే 2050 సంవత్సరానికి ఇక్కడి జనాభా మరీ తగ్గిపోతుందట.

నెదర్లాండ్ ...సముద్రమట్టానికి దిగువనున్న దేశం.....నెదర్లాండ్ దేశంలోని భూభాగంలో 27 శాతం భూభాగం సముద్ర మట్టానికంటే దిగువలో ఉన్నది. ఈ 27 శాతంలో ఉన్న కొన్ని నగరాలు సముద్రమట్టంకంటే 23 అడుగులు క్రిందలో ఉన్నదట.

తువలూ… ఎక్కువగా సందర్శించని దేశం. ……..అంటే ఎక్కువ మంది సందర్శించని దేశం.ఎందుకంటే ఆస్ట్రేలియాకీ, హవాయ్ కి మధ్య ఉన్నది ఈ దేశం. గ్లోబల్ వార్మింగ్ వలన ఎక్కువ నష్టపోయిన మొదటి దేశం ఇదే. ప్రపంచ వాతావరణ ఉష్ణోగ్రత పెరగడంవలన ఇక్కడి సముద్ర మట్టం పెరిగి ఆ దేశములోని భూమి హరించుకుపోయింది. ఇక్కడ సముద్ర మట్టం పెరుగుతూనే ఉన్నదని చెబుతున్నారు. అందువలన సందర్శకులు ఈ దేశానికి వెళ్లటానికి భయపడుతున్నారని చెబుతారు. ఇదొక్కటే కారణం కాదు. ఆక్కడకి వెళ్ళాలన్నా వసతులు తక్కువగానూ,ఖరీదు ఎక్కువగానూ ఉండం మరో కారణం.

ఆస్ట్రేలియా......ఒకే ఖండంగా ఉన్న దేశం. మిగిలిన ఖండాలలో అనేక దేశాలు కలిసి ఉంటాయి.భూమిమీద ఖండమూ, దేశమూ ఒకటే అయిన ప్రదేశం ఇదిఒక్కటే.
Categories: Right

ఎక్కటానికనే కట్టిన ఎత్తైన గోడ...ఫోటోలు

Wed, 02/01/2012 - 09:28
ఎక్స్ కాలిబర్ అనే పేరుగల్ ఈ ఎత్తైన్ గోడ పొడవు 121 అడుగులు. నెదర్లాండ్లో కట్టబడ్డ ఈ గోడ ప్రపంచంలోనే ఎక్కేందుకనే కట్టిన గోడలలో అతి పొడవైనది. కొండలూ, పర్వతాలూ ఎక్కేందుకు ట్రైనింగ్ ఇవ్వటం కోసం కట్టిన గోడ. వంకరలతో కట్టబడ్డ ఈ గోడను ఎక్కుతూంటే ఒక పర్వతం ఎక్కుతున్నట్లుగా ఉంటుందట.








Categories: Right

సింగపూర్ బేస్ జంప్... సింగపూర్ ను అద్బుతంగా చూపిన వీడియో

Wed, 02/01/2012 - 03:33
పూర్తి స్క్రీన్లో చూడండి


Categories: Right

మేక్రో ప్రపంచం...అద్భుతమైన మరియూ అందమైన ఫోటోలు

Wed, 02/01/2012 - 02:01
గడ్డి పరకల మధ్య అతిచిన్న చువ్వలను ఉంచి వాటి మీద నిలబడ్డ నీటి బిందువులను తన కెమేరాలో పెద్దవిచేసి చూసిన షారాన్ జాన్ స్టోన్ అనే ఒక ఫొటోగ్రాఫర్ ఆ చిన్ని నీటి బిందువులలో ఉన్న రంగులను చూసి మైమరిచిపోయేడు. "అదో చిన్న ప్రపంచం" అని వర్నిస్తూ ఆ ఫోటోలను అందరికీ అందజేసేరు.












Categories: Right

కోలాపూర్ మహాలక్ష్మి గుడిలొ సూర్య కిరణాల పండుగ...ఫోటోలు

Tue, 01/31/2012 - 10:03
కోలాపూర్ మహాలక్ష్మి గుడిలో నవంబర్ నెల 9,10 మరియూ 11 వ తారీఖులలో సూర్యకిరణాలు దేముని విగ్రహంపై పడుతుంది. ఆ 3 రోజులనూ ఒక పండుగులాగా చేసుకుంటారట.







Categories: Right

తొమ్మిదేళ్ల వయస్సులో నే మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ గా ఎదిగిన యంగ్ లేడీ మరణం...ఫోటోలు

Tue, 01/31/2012 - 02:42
కంప్యూటర్ జీనియస్ గా పేరుసాధించి తొమ్మిదేళ్ల వయస్సులో(2005) మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ గా ఓ వెలుగువెలి గిన పాకిస్తాన్ యంగ్ లేడీ అర్ఫాకరీమ్ తీవ్ర అనారోగ్యంతో మరణించారు. ఆమె వయస్సు 16 సంవత్సరాలు.

ప్రపంచంలోనే మొట్టమొదటి అతి చిన్న వయసు మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ప్రొఫెషనలైన ఈ చిన్నారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుతోపాటూ అందరి మన్ననలూ ప్పొందింది.

అనారోగ్యంతో బాధపడుతున్న ఈ చిన్నారిని మైక్రోసాఫ్ట్ అధినేత ఎలాగైన(ఎంత ఖర్చుచేసైనా)కాపాడాలనుకున్నారు.కానీ ఎన్నో బహుమతులందుకున్న ఈ చిన్నారి అనారోగ్యానికి బలైపోయినా అందరి మనసులలోనూ కొలువైపోయింది.








Categories: Right

జాతిపిత మహాత్మా గాంధీకి హృదయపూర్వక నివాళులు…..అరుదైన అంత్యక్రియల ఫోటోలు

Tue, 01/31/2012 - 01:38









చదవడం వలన ప్రయోజనం ఏమిటంటే నలుమూలల నుంచి వచ్చే విజ్ఞానాన్ని పొందడం, దాన్నుంచి జీవిత పాఠాలను నేర్చుకోవడం. - గాంధీజీ
********
నియమబద్ధ జీవితానికి కోర్కెలను జయించడం మొదటి మెట్టు. - గాంధీజీ,
*********
మహాత్మా గాంధీకున్న మనో బలం ఈరోజు ఎందరికి ఉంది ? అప్పుడే కొన్ని దేశాలలో వాళ్ళు, " గాంధీ నిజం గా ఒక మనిషేనా లేక కట్టుకథా ? అంతటి సంకల్ప బలం మానవమాత్రులకు ఉండడం సహజమా " అనుకుంటున్నారట.
Categories: Right

విరిగిపోయిన వంతెన మీదనుండి స్కూలుకు వెడుతున్న పిల్లలు...ఫోటోలు మరియూ వీడియో

Mon, 01/30/2012 - 09:21
ఈ పిల్లల ధైర్యసాహాసాలకు బహుమతులు ఇవ్వవచ్చు. చుట్టూ తిరిగి వెడితే సుమారు 5 మైళ్ల దూరం నడవవలసి వస్తుందని, టైముకు స్కూలుకు చేరుకోలేమని ఈ పిల్లలు సాహసంతో ఈ వంతెనను దాటి స్కూలుకు వెడుతున్నారు. ఇండోనేషియాలోని ఈ వంతెన ఈ మధ్య ఏర్పడిన వరదల వలన కొట్టుకుపోయి అలా మిగిలిపోయింది. ఈ వంతెనను సరిచేయడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవటంలేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు.






Categories: Right

చైనావారి నూతన సంవత్సర వేడుకలు...ఫోటోలు

Mon, 01/30/2012 - 03:10
ఈ నెల జనవరి 23 న చైనా వారికి నూతన సంవత్సరం ప్రారంభమైనది. ఈ సంవత్సరాన్ని వారు వాటర్ డ్రాగన్ సంవత్సరంగా ప్రకటించుకున్నారు.ఈ సంవత్సరం వారికి అంతా శుభమే జరుగుతుందట. అందువలన ఈ సంవత్సరాన్ని చైనా దేశంలోనే కాకుండా, చైనా దేశీయులు తామున్న ప్రతిదేశం లోనూ వేడుకలు జరుపుకున్నారు.











Categories: Right

మాజీ చైనా ప్రధాని చౌ యెన్ లై ని, చార్లీ చాప్లిన్ ని తన నటనతో ఆశ్చర్యపరిచిన విశ్వ నటచక్రవర్తి,నటసార్వభౌమ 'య(శ)స్వి'రంగారావు గారి గురించి

Mon, 01/30/2012 - 01:25
సామర్ల వెంకట రంగారావు గారు (SVR) 03 -07 -1918 న లక్ష్మినరసాయమ్మ,కోటేశ్వర రావు లు అనబడే దంపతులకు కృష్ణా జిల్లా లోని నూజివీడు లో జన్మించారు.స్వస్థలం కాకినాడ.తండ్రి excise inspector గా నూజివీడులోపని చేశారు. తల్లి వెంకటేశ్వర స్వామి వారి భక్తురాలు అవటం చేత కొడుకు కు వెంకట రంగారావు అనే పేరు పెట్టుకున్నారు.

ధనవంతులైన తల్లితండ్రులు ఇతనిని హై స్కూల్ విద్యకే మద్రాస్ పంపించారు.SVR తన 12 వ ఏటనే,హై స్కూల్ విద్య పూర్తి చేసి,B.Sc లో చేరారు. హై స్కూల్ విద్యార్ధి గా ఉన్నప్పటి నుంచి ఇతనికి కళలంటే ఎక్కువ మక్కువ.కాలేజీ లో చదువుకునేటప్పుడే,అతను తన నటనకు మెరుగులు దిద్దుకున్నాడు.డిగ్రీ పూర్తి అయిన తర్వాత,బందరు లో Fire Service డిపార్టుమెంటు లో వుద్యోగం సంపాదించారు.అప్పుడు ఆయన మదిలో రెండు ఆలోచనలున్దేవి, M.Sc లో చేరటమా లేక సినిమా రంగంలో నటుడిగా కృషి చెయ్యటమా! అని.వారి బంధువైన బి.వి.రామానందం గారు SVR ను సినీ రంగానికి ఆహ్వానించారు.ఆ సినిమా పేరు వరూధిని.రంగారావు గారు వెంటనే వుద్యోగం మానివేసి,సిని రంగం లో ప్రవేశించటానికి మద్రాస్ పయనమయ్యారు.వరూధిని అనుకున్నంత విజయం సాధించలేదు.అందుచేత కొంత కాలం వరకు వారికి సినిమాల లో వేషాలు వేసే అవకాశం రాలేదు.తర్వాత రంగారావు గారికి విసుగు పుట్టి,జంషెడ్పూర్ లో TATA వారి సంస్థలో కొన్నాళ్ళు వుద్యోగం చేశారు అయితే అతనికి నటన పైన వున్న ప్రేమ తొలగిపోలేదు,పైగా ఎక్కువ కూడా అయినది.

27 -12 -1947 న లీలావతి అనబడే కన్యామణి తో వీరి వివాహం జరిగినది.SVR గారికి తదుపరి రోజుల్లో 'పల్లెటూరిపిల్ల' అనే చిత్రం లోవిలన్ గా నటించటానికి శ్రీ బి.ఏ. సుబ్బారావు గారి నుండి ఆహ్వానం వచ్చింది.అయితే,దురదృష్టం ఏమిటంటే,వీరు మద్రాస్ వెళ్ళటానికి రైలు ఎక్కే సమయం లో,వారి నాన్న గారు స్వర్గస్తు లైనారని తంతి వార్త వచ్చింది.తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసుకొని,మద్రాస్ వెళ్ళేటప్పటికి,ఆ వేషం మరొకరికి ఇవ్వబడింది.అదృష్టమేమంటే,విజయా వారి,కే.వి.రెడ్డి గారి దృష్టిలో పడటమే!పాతాళ భైరవి లో నేపాలీ మాంత్రికుడి వేషం వేసే ఛాన్స్ వచ్చింది.వచ్చిన ఆ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటమే కాకుండా,ఆయన ఆ పాత్ర పోషించిన తీరు పండిత పామరుల ప్రశంసలు అందుకుంది. ఇక విజయా వారికి ఈయన ఆస్థాన నటుడయ్యారు.ఆ తర్వాతనే విదులైన,విజయా వారి'పెళ్లి చేసి చూడు' సినిమాలో వీరు పోషించిన 'వియ్యన్న' పాత్ర కూడా నేపాలీ మాంత్రికుడి వేషం వలె తెలుగువారి గుండెల్లో చిరస్థాయి గా నిలిచిపోయింది.దాని తమిళ version లో కూడా అదే పాత్రను పోషించి, తమిళ ప్రజల మన్ననలను కూడా పొందారు.విజయా వారు మాయాబజార్ తీసే టప్పుడు, 'ఘటోత్కచుని' వేషానికి ముందుగా వీరిని తీసుకున్నారు.కే.వి.రెడ్డి గారు అన్నారుట'ఆ వేషానికి వేరే ఆప్షన్ లేదు' అని.మాయాబజార్ అంత రసవంతం గా తయారుకావటానికి ముఖ్య కారకులలో అతి ముఖ్యుడీయన!అలా నిర్విరామమగా వీరి నట యాత్ర తెలుగు ,తమిళ రంగాలలో కొనసాగింది.వీరు నటించిన నర్తనశాల లోని కీచకుని వేషానికి పలువురి ప్రశంసలు లభించింది.

సతీ సావిత్రి అనే సినిమా తీసేటప్పుడు ,చైనా ప్రధాని చౌ యెన్ లై ,వీరిని సెట్లో యముని వేషంలో చూసి ఆశ్చర్య చకితులయ్యారట!. జకార్తా లో జరిగిన ఇండోనేసియా ఫిలిం ఫెస్టివల్ లో,వీరి కీచకుని వేషానికి ఉత్తమ నటుని అవార్డు తో పాటుగా బంగారు పతకం కూడా దక్కింది.ముఖ్యం గా పౌరాణిక సినిమాలలో ప్రతి నాయకుడి గా నటించి తనదైన ఒక ప్రత్యేక బాణీ ని ప్రవేశపెట్టారు. రావణ బ్రహ్మ,దుర్యోధనుడు,హిరణ్యకశిపుడు .మాయల పకీరు,మున్నగు వేషాలు వీరిని తెలుగు ప్రేక్షకుల గుండెలపై చిర స్థాయి గా కూర్చో పెట్టాయి.సంభాషణల ఉచ్చారణ, పలికే విధానం,ఆ విరుపు,హావ భావాలు మరెవరి తరం కావు.యెంత మహా నటుడినైనా Dominate చేయ గల సత్తా సామర్ధ్యం వీరి సొంతం. వీరితో నటించాలంటే ఆనాటి అగ్రనటులు సైతం భయపడేవారు,ఒక్క సావిత్రి తప్ప!ఆయన సమకాలీనుడైన గుమ్మడి గారి మాటల్లో చెప్పాలంటే,ఇటువంటి నటుడు పొరపాటున మన దేశంలో పుట్టాడు,మరే దేంలో నైనా పుట్టివుంటే,ప్రపంచపు నటులలోనే మేటి నటుడయ్యే వాడు!ఇంతకన్నా గొప్ప అవార్డు,రివార్డ్ ఏమున్నది?

“బంగారు పాప” (1955) ఆర్ధికంగా విజయం సాధించక పోయినా మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రంలో ఎస్.వి. రంగారావు నటనను,లండన్లో చూసిన చార్లీ చాప్లిన్, ఇలియట్ “బ్రతికి వుంటే చాలా సంతోషించి ఉండేవాడని” అన్నారు. (జార్జి ఇలియట్ రాసిన “సైలాస్ మార్నర్” అన్న ఆంగ్ల నవల 'బంగారుపాప'కు ఆధారం).

చాలా సాంఘీక,చారిత్రిక,పౌరాణిక సినిమా ల లో విభిన్న పాత్రలు పోషించి. తనకు తానే సాటి అని అనిపించుకున్నారు.రంగారావు గారు బంగారు పాప అనే సినిమాలో ఒక గుడ్డివాని వేషం వేస్తున్నారు,అదే సమయంలో NTR గారు చిరంజీవులు అనే సినిమాలో గుడ్డివాని వేషం వేస్తున్నారు.ఇద్దరూ కలిసి పొద్దున్నే,మద్రాస్ రైల్వే స్టేషన్ కి వెళ్లి, గుడ్డి వారి హావభాలు పరిశీలించేవారట! అలా సమాజంలో వున్న వ్యక్తులను పరిశీలించటం వల్లనే, వారి నటన అతి సహజం గా వుండేది!ఆ రెండు సినిమాలలో వారి నటన అందరి మన్ననలను పొందిన విషయం మనందరికీ తెలినదే!తెలుగులో NTR నటించిన'కథానాయకుడు సినిమా యెంత విజయం సాధించిందో మనందరికీ తెలిసిన విషయం.అందులో నాగభూషణం అద్భుతం గా నటించారు.అదే సినిమాను తమిళం లో మళ్ళీ తీసేటప్పుడు,నాగభూషణం వేసిన పాత్రను తమిళ సినిమాలో SVR వేశారు.ఆ సినిమా తెలుగులో కన్నా ఘనవిజయం సాధించింది,కేవలం SVR నటన వల్లనే!తమిళం కూడా అనర్గళం గా మాట్లాడే ఆయన,తమిళ సినిమాలలో నటించే టప్పుడు తమిళులు చాలామంది ,వీరు మా తమిలుడే అని భావించే వారట!అగ్ర నటులతో సమానంగా వీరు పారితోషికం తీసుకునే వారట!

వీరికి ముగ్గురు సంతానం.ఇద్దరు ఆడపిల్లలు(విజయ,ప్రమీల)ఒక కుమారుడు(కోటేశ్వర రావు).నిర్మాతగా కూడా మారి విజయవంతమైన నాదీ ఆడజన్మే! ,చదరంగ,బాంధవ్యాలు,సుఖదు:ఖాలు లాంటి సినిమాలను తీసారు.చదరంగం,బాంధవ్యాలు--సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు,పలు సంస్థల నుండి చాలా అవార్డ్స్,బిరుదులు పొందారు.
అకస్మాత్తుగా, తీవ్రమైన గుండెనొప్పి వచ్చి,ఉస్మానియా హాస్పిటల్ లో వైద్యం తీసుకునే సమయంలో,మళ్ళీ మరొక్కసారి గుండెనొప్పి చేత 18 -03 -1974 న తుది శ్వాసవిడిచారు.

ఆ మహనీయునికి నా ఘనమైన నివాళి!!!

అందించినవారు......టీవీఎస్.శాస్త్రి గారు.
Categories: Right